ఒక్క హిట్టు కోసం కసిగా వున్న స్టార్ డైరెక్టర్స్..

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ శ్రీను వైట్ల, గుణశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్స్ అయిన వీరు ఒకప్పుడు తమ సినిమాలతో ఆడియన్స్ ని కట్టిపడేశారు.ఎన్నో గుర్తుండిపోయే సినిమాలు చేశారు. ఇక గుణశేఖర్ విషయానికి వస్తే ఈయనకి హిట్లు చాలా తక్కువ. కాని ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉంటాయి. తద్వారా ఈయన సినిమాలు దారుణంగా ప్లాప్ అవ్వకపోయిన యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంటాయి.ఇక ఈయన కెరీర్ లో కమర్షియల్ గా ఆడియన్స్ ని మెప్పించి బ్లాక్ బస్టర్ అయిన చిత్రాలు ఒకటి మెగాస్టార్ తో తీసిన "చూడాలని వుంది". రెండోది సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన "ఒక్కడు". చూడాలని వుంది పక్కన పెడితే ఒక్కడు సినిమా గురించి మాట్లాడుకుందాం.


సూపర్ స్టార్ మహేష్ బాబుతో హిట్టు కొట్టాలనే కసితో గుణశేఖర్ తీసిన సినిమా ఇది.ఈ సినిమాతో మహేష్ టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరో అయ్యాడు. అప్పటిదాకా లవర్ బాయ్, ఫ్యామిలీ హీరో అనిపించుకున్న మహేష్ ఈ సినిమాతో పెద్ద మాస్ హీరో అయ్యి కోట్లాది అభిమానులని సంపాదించుకున్నాడు. తెలుగు సినిమా చరిత్రలో కొన్ని తోపు చిత్రాలలో ఖచ్చితంగా ఒక్కడు టాప్ ప్లేస్ లో నిలుస్తుంది. ఈ సినిమా సృష్టించిన రికార్డ్స్ అన్ని ఇన్ని కావు. ముఖ్యంగా మహేష్ నటన, గుణశేఖర్ స్క్రీన్ ప్లే ఈ సినిమాని ఒక మాస్టర్ పీస్ సినిమాగా మార్చాయి. ఇప్పటికి ఎప్పటికి కూడా ఒక్కడు సినిమా అంటే ఒక ప్రత్యేకమైన తోపు సినిమాగా  ఆడియన్స్ అనుకుంటూ వుంటారు.ఈ సినిమాతో అంత ప్రభంజనం సృష్టించిన గుణశేఖర్ ఇప్పుడు వరుస ప్లాపులతో సతమత మవుతూ "శాకుంతలం"సినిమాతో ఒక్క హిట్టు కసిగా ఎదురు చూస్తున్నాడు.


ఇక శ్రీను వైట్ల విషయానికి వస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీకి తన స్టైల్ లో ఒక కొత్త ఫార్ములాని అందించాడు. ఈయన ఫార్ములాతో ఇండస్ట్రీలో చాలా సినిమాలు వచ్చి హిట్లు కొట్టాయి.ఇక ఈయన సినిమాలు ఆధ్యంతం ఎంతో వినోదాత్మకంగా ఉంటాయి. ఇక ఈయన కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్ సినిమా అంటే సూపర్ స్టార్ మహేష్ తో చేసిన "దూకుడు" అనే చెప్పాలి. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యింది. అంతేకాకా 100 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టిన తొలి సినిమాగా ఘనత దక్కించుకుంది. తెలుగు లో ఫస్ట్ 100 కోట్ల క్లబ్ ఓపెన్ చేసిన సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమానే శ్రీను వైట్లకి లాస్ట్ హిట్. ఇక తరువాత మంచి టాప్ బ్యానర్ లో ఛాన్స్ లు వచ్చిన నిలబెట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం మంచు విష్ణుతో "ఢీ 2"సినిమాతో హిట్ కొట్టాలని కసిగా వున్నాడు.అయితే ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఇద్దరి దర్శకుల ఆల్ టైం బ్లాక్ హిట్స్ అలాగే లాస్ట్ హిట్స్ కూడా సూపర్ స్టార్ మహేష్ సినిమాలే కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: