అభిరామ్ ఎంట్రీ పై షాకింగ్ ట్విస్ట్ !

Seetha Sailaja
టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో వారసుల హవా కొనసాగుతోంది.  ఇలాంటి ట్రెండ్ కొనసాగింపులో రానా దగ్గుబాటి సోదరుడు అభిరామ్ టాలీవుడ్ లో హీరోగా అరంగేట్రం చేయడానికి రంగం  సిద్ధం అయింది అన్నవార్తలు ఎప్పటినుంచో వస్తున్నాయి. కొంత కాలం క్రితం ఒక సంచలన వివాదంలో చిక్కుకున్న అభిరామ్ చాలకాలం చాల మౌనంగా ఉన్నాడు.  


ఇప్పుడు ఈ మౌన ముద్ర నుండి అభిరామ్ బయటకు వచ్చే సమయం  సిద్ధం అయింది అంటున్నారు. ఎట్టకేలకు అతడి తొలి మూవీ ప్రాజెక్ట్  ఫైనల్ అయింది అన్నవార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అభిరామ్ ను తెలుగు తెరకు పరిచయం చేసే బాధ్యతను దర్శకుడు తేజకు అప్పగింఛినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఇటీవల లాక్ అయింది అని అంటున్నారు.  


తెలుస్తున్న సమాచారం మేరకు  ఇది తేజ మార్క్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ అని లీకులు వస్తున్నాయి. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది అంటున్నారు. అభిరామ్ ని రెగ్యులర్ హీరోలా చూపించే ఆలోచన లేదు. రానా ఎలా అయితే ‘లీడర్’ తో డిఫరెంట్ టోన్ ఉన్న హీరోగా నిరూపించుకున్నాడో అలానే ఒక కొత్త పంథా స్క్రిప్టుతో ఈసినిమా ఉంటుందది అంటున్నారు. అభిరామ్ కోసం తేజ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ కథాంశాన్ని సిద్ధం  చేసాడని  సురేష్ బాబు ఇటీవల స్క్రిప్ట్ ని ఫైనల్  చేయడమే కాకుండా  తేజతో కలిసి సురేష్ బాబు స్క్రిప్ట్ విషయంలో చాలా వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.


తెలుస్తున్న సమాచారం మేరకు తేజ రెండు మూడు విభిన్నమైన స్క్రిప్టుల్ని రెడీ పెట్టి అందులో ‘చిత్రం’ ‘1.1’ ఒకటి అని టాక్. అప్పట్లో ఉదయ్ కిరణ్ కు కెరియర్ టర్నింగ్ ఇచ్చిన ఆ మూవీ సీక్వెల్  అభిరామ్ కి సూట్ కాదని సురేష్ బాబు  భావించి  యాక్షన్ ఎంటర్ టైనర్ కే మొగ్గు చూపాడని తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ సర్దుమణిగాకా ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుంది అంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: