జూనియర్ ఎన్టీఆర్ బాల నటుడిగా నటించిన 2 సినిమాలివే ?

VAMSI
తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి కుటుంబానికి ఉన్న ప్రత్యేకత, గౌరవం వేరు. ఈ వంశం నుండి వచ్చిన హీరోలు అందరూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. మన అందరి అభిమాన నాయకుడు మరియు కథానాయకుడు అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నుండి ఈ వంశం యొక్క సినీ ప్రస్థానం మొదలయింది. ఈయన నటనకు ఆ రోజుల్లో ప్రజలు ఆనందోత్సాహంలో తెలేవారు. ఆ తర్వాత ఈ కుటుంబం నుండి వచ్చిన బాలయ్య , హరికృష్ణ , జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ లు ఆ దారిలోనే నడిచారు. కానీ వీరిలో హరికృష్ణకు పెద్దగా కలిసిరాక కొన్ని సినిమాలతోనే సరిపెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే సీనియర్ ఎన్టీఆర్ లాగా ప్రజలకు కనిపించిన హీరో మన జూనియర్ ఎన్టీఆర్. అచ్చం తాతలాగే పోలి ఉన్న జూనియర్ ఎన్టీఆర్ నటనలోనూ ఆయన లాగే పేరు తెచ్చుకున్నాడు.  ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న హీరోలలో ఒక అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు.
 

ఈ మధ్యనే కరోనా వైరస్ సోకి ప్రస్తుతం సెల్ఫ్ ఐషోలేషన్ లో ఉన్నారు. కాగా ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ తన 38 వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. దీనితో ఈయన అభిమానులందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. అయితే ఈ రోజు ఎన్టీఆర్ కి సంబంధించి సినిమా విషయాలను  తెలుసుకుందాము. మామూలుగా ఎంతోమంది హీరోలు బాలనటులుగా  కూడా నటించి ఉంటారు. వారిలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడే తన మనవడు లోని కళను గుర్తించి  "బ్రహ్మర్షి విశ్వామిత్ర" అనే సినిమాతో బాల నటునిగా సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు. ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ "బాల రామాయణం" చిత్రంలో రాముడిగా నటించాడు. ఇక ఈ రెండు చిత్రాల తరువాత నటనలో మరింత శిక్షణ తీసుకుని అన్ని అంశాల్లోనూ ఆరితేరాడు.

తొలిసారి హీరోగా 2001 లో వచ్చిన "నిన్ను చూడాలని" సినిమా ద్వారా ఈ యంగ్ హీరో తన సినిమా ప్రస్థానాన్ని ప్రారంభించి ఇప్పటి వరకు జైత్రయాత్ర కొనసాగిస్తూ ఉన్నాడు. ఈయన సినీ ప్రస్థానంలో అవార్డులు, రికార్డులు ఎన్నో ఉన్నాయి. కాగా ఈయన కొత్త చిత్రం "ఆర్ ఆర్ ఆర్" దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది.  మరి త్వరలోనే కరోనా అంతరించిపోయి మంచి రోజులు వస్తాయని ఆశిద్దాం. జూనియర్ ఎన్టీఆర్ హాపీ బర్త్డే....లవ్ యూ...!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: