ఆ మూవీ సక్సెస్ తో ఎమోషనల్ అయిన ప్రిన్స్ మహేష్ బాబు.

Divya


సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఘట్టమనేని కృష్ణ చిన్న కుమారుడు.. మహేష్ బాబు బాల నటుడిగా సినీరంగ ప్రవేశం చేసి, ఎనిమిది సినిమాలకు పైగా నటించాడు. ఇక ఆ తర్వాత  కథానాయకుడిగా 25కి పైగా చిత్రాల్లో నటించాడు. మొదటగా రాజకుమారుడు సినిమా ద్వారా నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు. ఈ చిత్రానికి గాను నంది ఉత్తమ నూతన నటుడు పురస్కారం కూడా అందుకున్నాడు. తరువాత 2003లో వచ్చిన నిజం, 2005లో వచ్చిన అతడు, 2011లో వచ్చిన దూకుడు, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా ఎన్నో సినిమాలకు నంది అవార్డులను గెలుచుకున్నాడు మహేష్ బాబు..

అయితే ఈ అవార్డులు అన్నీ ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా శ్రీమంతుడు సినిమాకు వచ్చిన అవార్డు మరో ఎత్తు . ఎందుకంటే ఈ అవార్డ్  తో బాగా  ఎమోషనల్ అయ్యాడు మహేష్ బాబు.. శ్రీమంతుడు సినిమా కు   కొరటాల శివ దర్శకత్వంలో వై నవీన్ ,రవిశంకర్, v MOHAN' target='_blank' title='సి వి మోహన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సి వి మోహన్, ఘట్టమనేని మహేష్ బాబు లు  నిర్మాతలు గా వ్యవహరించగా, 2015 ఆగస్టు 7న అట్టహాసంగా విడుదలైన చిత్రం శ్రీమంతుడు.. ఇక ఈ చిత్రం విడుదలైన తర్వాత కృష్ణ ఈ సినిమాను చూసి, వెంటనే  మహేష్ బాబు ను  ఇంటికి పిలిపించారు. ఇక మహేష్ బాబు తో కృష్ణ ఈ సినిమా చాలా బాగా వచ్చింది.. ఇందులో బాగా నటించావు అంటూ భుజం తట్టాడు. ఇక ఒక్కసారిగా కంట్లో నీళ్లు తిరిగి, ఆ కన్నీళ్లను బయటకు రానివ్వకుండా తనలోనే దాచుకున్నాడు మహేష్ బాబు.. అంటే ఈ సినిమా సక్సెస్ తో తను ఎంత ఎఫర్ట్ పెట్టి సినిమా తీశాడు అర్థమవుతుంది.
ఈ సినిమాలో రెండు ఊర్లను దత్తత తీసుకొని, వాటి అభివృద్ధికి తమ వంతు సహాయం చేయడం జరిగింది. ఇది ప్రేక్షకులకు  బాగా నచ్చడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.. అయితే నిజజీవితంలో కూడా మహేష్ బాబు రెండు గ్రామాలను దత్తత తీసుకున్నాడు. ఇక వీరి లాగే మంచు విష్ణు,  ప్రకాష్ రాజు వంటి వారు కూడా గ్రామాలను దత్తత తీసుకుని, ఆ గ్రామాల అభివృద్ధికి పాటుపడుతున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి..
అయితే శ్రీమంతుడు చిత్రానికి గాను 2015లో సైమా అవార్డ్స్ లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ గా  నంది పురస్కారాలను పొందాడు.. అంతేకాకుండా ఉత్తమ చిత్రంగా మైత్రి మూవీ మేకర్స్ కూడా నంది పురస్కారాలు అందుకుంది . ఇక ఇదే చిత్రానికి 2016 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఐఫా అవార్డును కూడా అందుకున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: