నిక్ కంటే ముందు ప్రియాంక ఆ హీరో ని పెళ్లి చేసుకోవాలనుకుందా..!!

P.Nishanth Kumar
బాలీవుడ్ హీరోయిన్ లలో నిత్యం ఏదొక విషయంలో ట్రెండింగ్ గా నిలుస్తూ ఉంటుంది హీరోయిన్ ప్రియాంక చోప్రా.. తనకన్నా చిన్నవాడైన నిక్ ని పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించిన ప్రియాంక ఆ తర్వాత చేసే ప్రతిదాన్ని ట్రెండింగ్ లో నిలిచేలా చూసుకుంటుంది.. పెళ్లి కి ముందు టాప్ హీరోయిన్ ప్రియాంక పెళ్లి తర్వాత అప్పుడో ఇప్పుడో సినిమా చేస్తూ పూర్తిగా హాలీవుడ్ కి పరిమితమవుతుంది ఈ ముద్దుగుమ్మ ..

పెళ్లి తర్వాత ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం..ఎలాంటి పాత్రనైనా చేసే ప్రియాంక బోల్డ్ పాత్రలు చేయడంలో స్పెషలిస్ట్.. తన అందచందాలతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ప్రియాంక ఇప్పుడు హాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరిస్తుంది..ఇకపోతే  సినిమాల్లో తాను కనిపించినా, కనిపించకపోయినా ప్రియాంక మాత్రం అభిమానులకు సోషల్ మీడియా ద్వారా టచ్ లోనే ఉంటుంది. తన బయోగ్రఫీ సంచలన విషయాలు వెల్లడిస్తూ రోజుకో వివాదాన్ని సృష్టిస్తుంది ప్రియాంక..

ఇకపోతే హీరోయిన్ లకు ఎఫైర్ లు ఉండడం కామన్ అన్న విషయం తెలిసిందే.. అలా ప్రియాంక చోప్రా నిక్ ని పెళ్లి చేసుకోకముందు ఓ హీరో తో ప్రేమాయణం నడిపింది.. అతని తో నే తన పెళ్లి అనుకుంది.. కా నీ చివరి నిమిషంలో వారి ప్రేమ పెటాకులైంది.. అలాగే ప్రియాంక చోప్రా పెళ్లి విషయం చర్చకు వచ్చినప్పుడు దేశీ యువకుడితో వివాహం జరిపించాలని తన కుటుంబం డిసైడ్ అయింది. ఆ క్రమంలో తమ కుటుంబానికి దగ్గరగా ఉండే పలువురిని ప్రియాంకతో సంబంధం కోసం చూశారట. చివరకు దేవోంకే దేవ్.. మహదేవ్ ఫేమ్ మోహిత్ రైనాతో పెళ్లి జరిపించాలని నిర్ణయం తీసుకొన్నారని అప్పట్లో కుటుంబ సభ్యులు చేశారని ప్రియాంక స్వయంగా తెలిపారు. కానీ తాను స్టార్ హీరోయిన్ అవడం, అతను టెలివిజన్ కే పరిమితమవడంతో ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందట..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: