దండం పెడుతూ సాయం కోరిన మ‌రో క్రికెట‌ర్...క్ష‌ణాల్లో స్పందించిన సోనూ

MADDIBOINA AJAY KUMAR
దేశంలో క‌రోనా డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకు ల‌క్ష‌ల సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతున్నాయి. అంతే కాకుండా సెకండ్ వేవ్ లో వైర‌స్ ఉదృతి ఎక్కువ‌గా ఉండ‌టంతో మ‌ర‌ణాల సంఖ్య కూడా ఎక్కువ‌గానే ఉంది. అయితే కేసుల సంఖ్య వేగంగా పెర‌గ‌టంతో దేశంలో ఆక్సీజ‌న్ మ‌రియు క‌రోనా కు అవ‌స‌ర‌మైన అత్య‌వ‌స‌ర మందుల కొర‌త తీవ్రంగా ఏర్ప‌డింది. అయితే మందుల కోసం ఆక్సీజ‌న్ కోసం ప్ర‌భుత్వాల‌ను వేడుకున్నా ఉప‌యోగ‌ముండ‌ద‌ని గ్ర‌హించిన ప్ర‌జ‌లు క‌ష్టం రాగానే సోనూసూద్ వైపు చూస్తున్నారు. అయితే  సాధారణ పౌరులే కాదు.. సెలబ్రిటీలు సైతం సోనూసూద్ ను సాయం చేయాల‌ని కోర‌డం విశేషం. ఇటీవల సురేష్ రైనా సోనూసూద్ నుంచి సాయం అందుకోగా లేటెస్ట్‌గా మరో ఇండియన్ క్రికెటర్‌కు సైతం సోనూసూద్ అడగ్గానే సాయం చేశాడు. టీమిండియా మాజీ క్రికెటర్, స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనకు తెలిసినవారికి ఒకరికి రెమిడిసివర్ ఇంజెక్షన్ కావాలని దండం పెడుతూ సహాయం కోరగా.. సోనూసూద్‌ను అడగాలంటూ హ‌ర్బ‌జ‌న్ సింగ్ ఫాలోవర్స్ ట్యాగ్ చేశారు. 

వెంటనే స్పందించిన సోనూసూద్.. తప్పకుండా సహాయం అందుతుందంటూ భరోసా ఇచ్చేశాడు. అంతే కాదు చెప్పిన‌ట్టుగానే సోనూ సూద్ రెమిడిసివిర్ ఇంజ‌క్ష‌న్ ను పంపిచారు. దాంతో హర్బజన్ ధన్యవాదాలు సోదరా.. దేవుడు నీకు మ‌రింత బ‌లాన్నివ్వాల‌ని కోరుకుంటున్నా అంటూ రిప్లై ఇచ్చారు. ఇదిలా ఉండ‌గా సోనూసూద్ ప్ర‌స్తుతం ఒక వ్య‌వ‌స్థ‌లా పని చేస్తూ ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలుస్తున్నారు. త‌న టీంతో క‌లిసి ఎక్క‌డ ఆక్సీజ‌న్ అవ‌స‌ర‌మున్నా....క‌రోనా మందులు కావాల‌న్నా సొంత డ‌బ్బుతో అందజేస్తున్నారు. ఇక సోనూ సూద్ సేవాకార్య‌క్ర‌మాల‌ను మెచ్చుకుంటూ నెటిజ‌న్ లు ఆయ‌న‌ను ప్ర‌ధాని గా ఎన్నుకోవాలంటున్నారు. సినిమాలు చేస్తూనే ఇంత‌మందికి అండ‌గా ఉండే సోనూసూద్ ఎంతో రాజ‌కీయాల్లోకి వ‌స్తే ఎంతో అభివృద్ధి చేస్తాడ‌ని అనుకుంటున్నారు. అయితే మ‌రికొంద‌రు మాత్రం సోనూసూద్ ఇలాగే ఉండాల‌ని రాజ‌కీయం అనే బుర‌ద‌లోకి వ‌స్తే ఆయ‌న కూడా చెడిపోయే ప్ర‌మాదం ఉంద‌ని కామెంట్స్ పెడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: