విజయ్ దేవరకొండ ఆస్తి అన్ని కోట్లా..?

Suma Kallamadi
క్రియేటివ్ డైరెక్టర్ రవిబాబు దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ కామెడీ డ్రామా నువ్విలా సినిమాతో వెండితెరకు పరిచయమైన విజయ్ దేవరకొండ పదేళ్ల కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు. విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్‌రావు టీవీ సీరియల్ డైరెక్టర్ కాగా ఆయన తల్లి సాఫ్ట్ స్కిల్స్ ట్యూటర్ గా పని చేసేవారు. అర్జున్ రెడ్డి సినిమాతో ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్న విజయ్ గీతా గోవిందం సినిమాతో ఉత్తమ నటుడిగా జీ సినిమా అవార్డ్, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు గెలుచుకున్నారు.


అచ్చంపేట దగ్గర తుమ్మన్‌పేటలో మే 9, 1989 లో జన్మించిన విజయ్ దేవరకొండ ఈరోజు తన 32వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు ఎంత ఆస్తి ఉందో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.



విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా తరువాత రెండు చేతులా సంపాదిస్తున్నారు. వస్త్ర వ్యాపారం ప్రారంభించడంతో పాటు వాణిజ్య ప్రకటనలలో నటిస్తూ విజయ్ కోట్లు సంపాదిస్తున్నారు. కేవలం ప్రకటనల ద్వారానే విజయ్ దేవరకొండ కి నెలకు 50 లక్షల రూపాయలు వస్తాయని సమాచారం. ఇటీవల విజయ్ దేవరకొండ జూబ్లీ హిల్స్‌లో ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేశారు, దీని ధర దాదాపు 15 కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. విజయ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కూడా పెట్టుబడి పెట్టారని టాక్. మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్, ఆడి వంటి కోట్ల విలువైన కార్లను విజయ్ దేవరకొండ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇకపోతే ఆయన ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ చేస్తూ భారీగా రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నారు.



అయితే విజయ్ దేవరకొండ నికర ఆస్తి రూ. 30 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఆయన సంవత్సరానికి రూ.6కోట్లు సంపాదిస్తారని నివేదికలు పేర్కొంటున్నాయి. మధ్య తరగతి కుటుంబం నుంచి ఏ ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా నటనా రంగంలోకి అడుగు పెట్టిన విజయ్ ఈ రోజున ఆ స్థాయికి రావడానికి 5 ఏళ్లు పాటు బాగా కష్టపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: