బాలకృష్ణ తల్లి జ్ఞాపకార్థం గా నిర్మించిన బసవతారకం ఆసుపత్రి ఎవరి చేతుల మీదుగా ప్రారంభం అయ్యిందో తెలుసా..?
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గత సంవత్సరానికి ఇరవై వసంతాలు పూర్తి చేసుకోగా అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ తన చేతికొచ్చిన దగ్గరినుంచి మంచి సేవలనందిస్తున్నారు. 1988లో స్థాపించబడిన ఈ ఆసుపత్రి ని ఎంతో ప్రేమగా తనకొచ్చేలా చేసుకున్నాడు బాలకృష్ణ. ఆ తర్వాత ఈ ఆసుపత్రి లోనే తన అమ్మను చూసుకుంటూ ఉంటున్నానని పలు సందర్భాల్లో అయన చెప్పారు కూడా..
ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్(IACO) యుఎస్ఎ వారి సహకారంతో బసవతారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ ఇండియా ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ను స్థాపించి కోట్లమంది ఆరోగ్యాన్ని బాగుచేసింది. కాగా ఈ ఆసుపత్రి రారంభోత్సవానికి అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజపేయి గారి చేతిమీదుగా జరిగింది. రెండు దశాబ్దాలుగా ఎటువంటి మచ్చలేకుండా ఈ ఆసుపత్రి దిగ్విజయంగా ముందుకెతుంది.. తల్లి మీద ప్రేమతో ఎందరో తల్లుల సంతోషాలను కాపాడుతున్నాడు మన మనసున్న నందమూరి బాలకృష్ణ..స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు ముందు నిలిచి పరోపకారులైన డాక్టర్ తులసీదేవి పోలవరపు గారు, డాక్టర్ లూరి దత్తా త్రేయుడు గారు, డాక్టర్ దశరధ రాంరెడ్డి గారు, డాక్టర్ రాఘవ రఘు పోలవరపు, కాకతీయ సిమెంట్స్ వెంకటేశ్వర్లు గారు మరెంతో మంది సహకారంతో నాన్న గారి ఆశయ సాధన కోసం కృషి చేసి ఈ ఆసుపత్రిని ఉత్తమమైన క్యాన్సర్ హాస్పిటల్గా తీర్చిదిద్దారని బాలకృష్ణ ఓ సందర్భంలో చెప్పారు.