దాసరి.. నీకు లేరు ఎవరూ సాటి !
దాసరి నారాయణ రావు ఎంతో మంది స్టార్ హీరోలతో సినిమాలు తీసినా, ఎన్టీఆర్ తోనే ఆయన సక్సెస్ రేటును ఎక్కువగా సాధించారని చెప్పుకోవాలి. నటరత్న ఎన్టీఆర్ తో దర్శకరత్న తెరకెక్కించిన " మనుషులంతా ఒక్కటే , సర్కస్ రాముడు , సర్దార్ పాపారాయుడు , విశ్వరూపం ,బొబ్బిలిపులి వంటి చిత్రాలన్నీ శతదినోత్సవాలు చూశాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ సినిమా సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి.. ఈ రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ ను సాధించి, ఎన్టీఆర్ ను ఉన్నత స్థానంలో నిలబెట్టాయి.
మన తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో , ఏదైనా సినిమా మొదలవుతోంది అంటే చాలు, వారిలో ఆసక్తి రేకెత్తించేది. ఇక ఆయన సినిమా వచ్చిందంటే చాలు థియేటర్లకు పరుగులు తీసే వారు. దాసరి నారాయణ "అందుగలడు ఇందు లేడని సందేహము వలదు ..ఎందెందు చూసినా అందందే కలడు.." అన్న ఈ పద్యానికి నిర్వచనం ఎంత ఉందో, దాసరి నారాయణరావు కూడా అంతే.. ఇక్కడ అక్కడ అని లేకుండా చిత్ర పరిశ్రమలోని అన్ని రంగాలలోనూ తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
చిత్రసీమలో కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే , నిర్మాణం, దర్శకత్వం, నటన ఇలా పలు శాఖల్లో తనదైన బాణీ పలికించిన మేటి దాసరి. ఇక దాసరి నారాయణరావు "దేవదాసు" సినిమా చూసి, ఎన్టీఆర్ తో "దేవదాసు మళ్లీ పుట్టాడు" అనే సినిమాని తెరకెక్కించాడు.ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకపోయినా , దాసరి క్రియేటివిటీని చూసి జనం మెచ్చుకున్నారు. ఆ తర్వాత ప్రేమాభిషేకం ఏఎన్నార్ తో తెరకెక్కించాడు. ఈ చిత్రం తెలుగు వారిని విశేషంగా మురిపించింది.. ఇక అంతే కాకుండా ఎన్నో మరపురాని చిత్రాలను తెలుగువారికి అందించిన దాసరి నారాయణరావు తమిళ, కన్నడ ,హిందీ భాషల్లో కూడా కొన్ని చిత్రాలను రూపొందించాడు.. ఇక అందుకుగాను ఆయనకు ఎన్నో అవార్డులు, రివార్డులు రత్నాలుగా వెలుగొందుతూనే ఉన్నాయి.. నేడు దాసరి లేడు ..ఆ లోటును ఎవరూ భర్తీ చేయలేరు.. చరిత్ర లో ఎప్పటికీ నిలిచిపోయే వ్యక్తి దాసరి..