టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో వచ్చి బోల్తా కొట్టిన 10 సినిమాలివే..!

frame టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో వచ్చి బోల్తా కొట్టిన 10 సినిమాలివే..!

MADDIBOINA AJAY KUMAR
కొన్ని సినిమాలను తక్కువ బడ్జెట్ తో ఎలాంటి అంచనాలు లేకుండా తెరకెక్కిస్తారు. కానీ అవి సూపర్ హిట్ గా నిలిచి వసూళ్ల వర్షం కురిపిస్తే ఆ కిక్కే వేరు. కానీ కొన్ని సినిమాలకు కోట్లు ఖర్చు చేసి ఎన్నో అంచనాలతో నిర్మిస్తారు. అలాంటి సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు వచ్చే లాస్, బాధను మాటల్లో చెప్పలేం. అటు డబ్బు పెట్టిన నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ లు నష్టపోవడమే కాక తమ అభిమాన హీరో సినిమా అనుకున్నమేర విజయం సాధించలేదని ఫ్యాన్స్ కూడా నిరాశ చెందుతారు. అలా ఎన్నో అంచనాల మధ్య విడుదలై అంచనాలను రీచ్ అవ్వలేకపోయిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వచ్చిన సినిమా ఆజ్ఞతవాసి. ఈ సినిమా కంటే ముందు వీరి కాంబినేషన్ లో జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ లు కావడంతో ఆజ్ఞతవాసి సినిమా ఎన్నో అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా జోట్టింది.
పవన్ నటించిన కొమురం పులి సినిమా కూడా భారీ అంచనాలతో తెరకెక్కింది. ఖుషి లాంటి సూపర్ హిట్ ఇచ్చిన ఎస్ జె సూర్య దర్శకుడు కావడం..సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించడంతో ఎన్నో అంచనాల మధ్య సినిమా తెరకెక్కింది. కానీ అనుకున్న విజయం సాధించలేకపోయింది.
అక్కినేని వారసుడు "అఖిల్" సినిమా కోసం భారీగానే ఖర్చు చేశారు. అప్పటికే "మనం" సినిమాలో అఖిల్ లుక్ చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాంతో "అఖిల్" సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతే కాకుండా ఈ చిత్రానికి నితిన్ నిర్మాతగా వ్యవహరించగా..వివి వినాయక్ దర్శకత్వం వహించారు. సినిమా విడుదల తరవాత నితిన్ చేతులు భాగానే కాలాయి.
రానా,అల్లు అర్జున్ లాంటి హీరోలు..అనుష్క లాంటి హీరోయిన్ నటించిన సినిమా రుద్రమదేవి. భారీ సెట్ లతో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయింది.
ప్రముఖ దర్శకుడు మురుగదాస్..సూపర్ స్టార్ మహేష్ బాబు కంబోలో వచ్చిన సినిమా స్పైడర్. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కించగా డిజాస్టర్ గా మిగిలింది.
ప్రభాస్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన సినిమా రెబర్. ఈ సినిమా ను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. యాక్షన్ సన్నివేశాలనే దాదాపు 2 సంవత్సరాలు షూట్ చేశారు.  కానీ ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా కొట్టింది.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ జంజీర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం ఫ్లాట్ టాక్ ను మూట కట్టుకుంది.
బాలయ్య హీరోగా వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన సినిమా "ఒక్కమగాడు" ఈ సినిమాకు భాగానే ఖర్చు చేశారు. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది.
ఎన్టీఆర్ హీరోగా నటించిన "శక్తి" సినిమాకు నిర్మాత అశ్వినీ దత్ భారీగా ఖర్చు చేశారు. కానీ సినిమా ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుంది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమా తర్వాత మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన సినిమా "బ్రహ్మోత్సవం" ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కించారు. డిజాస్టర్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: