నాగబాబు భార్య గురించి మీకు తెలియని అసలు నిజాలు ఇవే..!

N.ANJI
బుల్లితెర నవ్వుల రారాజు నాగబాబు గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు. అంతేకాక పలు షోలకు జడ్జిగా వ్యవహరించారు. అయితే చాలా మందికి ఆయన భార్య గురించి తెలీదు. ఆమె గురించి తెలుసుకుందామా.

రుద్రవీణ షూటింగ్ సమయంలో నాగబాబు బిజీగా ఉన్నాడు. ఆ సమయంలో నాగబాబు తల్లి అంజనాదేవి పద్మజను బంధువుల పెళ్ళిలో చూసి ఎవరీ అమ్మాయి బాగుంది అని అనుకున్నదట.  పద్మజ బంధువుల అమ్మాయని తెలిసి అంజనాదేవి సంబరపడింది. ఆమె సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగింది. ఈ అమ్మాయి తన ఇంటి కోడలు అయితే బాగుండును అని అనుకున్నదట. పద్మజ చిరంజీవికి పెద్ద వీరాభిమాని.

పద్మజ చిరంజీవికి సంబందించిన పేపర్ కటింగ్స్ తో పెద్ద ఆల్బమ్ ని తయారుచేసిందట. అలాగే వారి ఇంటికి వచ్చిన అంజనాదేవికి కూడా ఈ ఆల్బమ్ చూపించటంతో అంజనాదేవి మురిసిపోయి ఆమెను తన ఇంటి కోడలిగా చేసుకోవాలని డిసైడ్ అయిందట. ఆ విధంగా పద్మజ నాగబాబును పెళ్లి చేసుకొని మెగా ఫ్యామిలిలో భాగం అయింది.

ఇక అప్పటి నుండి ఇప్పటివరకు పద్మజ వివాదాల జోలికి వెళ్ళటం జరగలేదు. భర్త,పిల్లల కోసం పాటు పడింది. ఆమె గార్మెంట్ బిజినెస్ చేస్తూ నాగబాబుకి సాయంగా ఉండేది. ఒక దశలో నాగబాబు నిర్మాతగా డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు పద్మజ ఎంతో సహాయం చేసింది.తన నగలు అమ్మి అప్పులు తీర్చమని చెప్పగా, ఆ విషయం తెలిసిన చిరంజీవి,పవన్ కళ్యాణ్ చాలా బాధపడ్డారట. ఆ సమయంలోనే చిరు,పవన్ కలిసి నాగబాబుని ఆర్ధికంగా గట్టెకించారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకొని సక్సెస్ గా ముందుకి సాగుతున్నాడు. ఇక కూతురు నిహారికా కూడా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన పెద్దగా సక్సెస్ కాకపోవటంతో పెళ్లి చేసుకొని వెబ్ సిరీస్ నిర్మాణంలో సెటిల్ అయింది. ఆమెకు భర్త ప్రోత్సాహం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: