అర్జున్ రెడ్డి దర్శకుడితో మెగాస్టార్ సినిమా..?
ఇక చిరు కోసం ప్రస్తుతం వంశీ పైడిపల్లి, సందీప్ రెడ్డి వంగా, వివి వినాయక్ లైన్ లో ఉన్నారు. వీరిలో ఇప్పటికే మెగాస్టార్ వంశీ పైడిపల్లి చెప్పిన కథను విన్నట్టు తెలుస్తోంది. అయితే ఇంకా ఎస్ కానీ నో కానీ మెగాస్టార్ చెప్పలేదట. దాంతో మెగాస్టార్ రిప్లై కోసం వంశీ వెయిట్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు మెగాస్టార్ సందీప్ రెడ్డి వంగా కథను వినేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో సందీప్ రెడ్డి వంగా పూర్తి స్క్రిప్ట్ ను వినిపించనున్నారట. ఒకవేళ మెగాస్టార్ కు కథ నచ్చితే ఈసినిమా ఫిక్స్ అవ్వనుంది. ఇదిలా ఉండగా సందీప్ చేసింది అర్జున్ రెడ్డి సినిమా ఒక్కటే. అయితే ఈ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు. అంతే కాకుండా బాలీవుడ్ లో ఇదే సినిమాను రీమేక్ చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఇక ప్రస్తుతం రణ్వీర్ సింగ్ హీరోగా "యానిమల్" సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ క్రేజీ డైరెక్టర్ మెగాస్టార్ ను మెప్పిస్తారా లేదా చూడాలి