షూటింగ్ మొదలు పెట్టాక ఆగిపోయిన పవన్ కళ్యాణ్ సినిమాలు ఇవే..!

Suma Kallamadi
తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారంటూ ఉండరు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు 26 సినిమాలు చేశారు. కానీ క్రేజ్ మాత్రం ఎవరికీ లేనంత ఉంది. అయితే దాదాపు 10 మూవీస్ ప్రకటన చేసినా వివిధ కారణాల వలన ఆగిపోయాయి. సీనియర్ నిర్మాత ఏఎం రత్నం సూర్య మూవీస్ పతాకంపై చెప్పాలని ఉంది మూవీ తీయాలని అనుకున్నారు. అమీషా పటేల్ ని హీరోయిన్ గా అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఆగిపోయిన ఈ మూవీ నువ్వేకావాలి సినిమాగా తెరకెక్కింది.
పవన్ జానీ సినిమా తర్వాత సత్యాగ్రహి మూవీ తీయాలని అనుకున్నారు. ఎంఎం రత్నం ప్రొడ్యూసర్ గా సెట్స్ మీదికి వెళ్లకుండానే ఈ సినిమా ఆగిపోయింది. జీసస్ క్రైస్ట్ పేరిట పవన్ తో ఓ మూవీ చేయాలని సింగీతం శ్రీనివాసరావు తీయాలని భావించి ప్రకటన కూడా చేశారు. ఎందుకో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. లారెన్స్ తో ఆసినిమా చేయాలన్న టాక్ వచ్చినా సెట్స్ మీదికి వెళ్ళలేదు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో కోబలి మూవీ పవన్ తో చేయాలనీ త్రివిక్రమ్ శ్రీనివాస్ అనుకున్నా ఎందుకో ఆగింది. అయితే ఆ కథనే అప్ డేట్ చేసి,జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత గా చేసారు.
ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీని పవన్ ని అనుకున్నారు. కానీ ఆ ప్లేస్ లో మహేష్ బాబు నటించాడు. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ కూడా పవన్ తో ఓ మూవీ చేయాలనుకున్నా సెట్స్ మీదికి రాలేదు. సంపత్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ 2ప్రకటన చేసినా ఎందుకో ఈ మూవీ ముందుకు వెళ్ళలేదు.
అలాగే కాటంరాయుడు కన్నా ముందే ఎస్ జె సూర్యతో ఓ సినిమా స్టార్ట్ చేశారు. కానీ ముందుకు వెళ్ళలేదు. వేదాళం మూవీ రీమేక్ పవన్ తో అనుకున్నా ఆగిపోయి. అదే మూవీ ఇపుడు చిరంజీవితో స్టార్ట్ చేస్తున్నారు. ఖుషి 2ప్రకటన వచ్చినా ఎందుకో ఆగిపోయింది. పోకిరి, అతడు, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి వంటి మూవీస్ కూడా పవన్ తో తీయాల్సినవే మిస్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: