హాలీవుడ్ లో రికార్డులు సృష్టిస్తున్న ఇండియన్ అమ్మాయి...?

VAMSI
ఎంతోమందికి నటులు కావాలని కోరిక ఉంటుంది. కానీ కుటుంబం నుండి సరైన ప్రోత్సాహం లేక వారి కల కలలాగా మిగిలిపోతుంది. మరి కొంతమందికి కుటుంబం నుండి సపోర్ట్ ఉంటుంది. కానీ నటనారంగంలో నిలబడలేక వెనుదిరుగుతూ ఉంటారు. కానీ కొంతమంది ఎటువంటి సహకారం లేకుండా, సినిమా రంగంలో తెలిసిన వారు ఎవరూ లేకపోయినా స్వయం శక్తితో నటిగా మారి ఎన్నో విజయాలను సాధిస్తూ ఉంటారు. ఒక ఇండియన్ అమ్మాయి ఇంగ్లీష్ సినిమా పరిశ్రమలో నటిగా తన  ప్రస్థానాన్ని మొదలుపెట్టి హాలీవుడ్ నే ఏలుతోంది. ఆ అమ్మాయి మరెవరో కాదు అర్చీ పంజాబీ. ఈమె చిన్నతనంలో ముంబైలో కొంతకాలం జీవించింది. ఆ తరువాత బ్రిటన్ కి వెళ్లిపోయారు. తల్లితండ్రులు గోవింద్ పంజాబీ మరియు పద్మా పంజాబీ...వీరిద్దరూ టీచర్స్ గా పనిచేస్తున్నారు. 


ఒకప్పుడు అర్చీ పంజాబీ వాళ్ళ తల్లి టీచర్ కావాలని అనుకున్నప్పుడు, వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. కానీ నాన్నతో గొడవపడి టీచర్ ఉద్యోగాన్ని సాధించింది. అందుకే అర్చీ పంజాబీ నటిగా మారుతానంటే వాళ్ళు అడ్డు చెప్పలేదు. తాను బిఎస్సీ పూర్తి చేసి నటిగా స్థిరపడాలని లక్ష్యంగా పెట్టుకుంది. అప్పటి నుండి చిన్న పాత్ర పెద్ద పాత్ర అని తేడా లేకుండా ప్రతి ఒక్క ఆడిషన్ కి వెళ్ళేది. అలా ఒక టీవీ సీరియల్ "సైరన్ స్పిరిట్స్" లో నటించే అవకాశం వచ్చింది. కానీ సినిమాల్లోకి మాత్రం "ఈస్ట్ ఈజ్ ఈస్ట్" అనే సినిమాతో వెండితెరపై కనిపించింది. ఈ సినిమాలో 25 ఏళ్ళు వయసున్న ఈ అమ్మాయి 14 ఏళ్ళు ఉన్న అమ్మాయి పాత్రలో నటించి మెప్పించింది. 


ఆ తరువాత ‘ది గుడ్‌ వైఫ్‌’ అనే వెబ్ సిరీస్ తో బుల్లితెర స్టార్ అయింది. ఇక అప్పటి నుండి తాను వెనక్కు తిరిగి చూసుకునే అవసరమే లేకుండా పోయింది. ఎన్నో అవార్డులు తనకు దాసోహమయ్యాయి. ఈమె నటించిన ఒక చిత్రం ఆస్కార్ అవార్డ్స్ కు కూడా నామినేట్ అయింది.  ఇప్పుడు కొన్ని వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది. అర్చీ పంజాబీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "మా అమ్మ ఎప్పుడూ ఒక విషయం చెప్పేది, ఈ ప్రపంచంలో సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు" అని...ఆ మాటలే నేను నటిగా అభివృద్ధి చెందడంలో స్ఫూర్తినిచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: