పీపీఈ కిట్ ధరించి మార్కెట్ కి వెళ్లిన నటి.. ప్రశంసిస్తున్న నెటిజన్స్..
తాజాగా రాఖీ సావంత్ కూరగాయలు కొనడానికి సమీప మార్కెట్‌కి వెళ్లారు. అసలే కరోనా విజృంభిస్తోంది. పైగా సెలబ్రిటీ బయట కనిపించింది అంటే చాలు.. జనాలు ఎలా గుమిగూడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని రాఖీ సావంత్ ఓ వినూత్న ఆలోచన చేశారు. జనాలు తనను గుర్తు పట్టకుండా ఉండటం కోసమే కాక.. కరోనా నుంచి కాపాడుకోవడం కోసం పీపీఈ కిట్ ధరించి మార్కెట్ కి వెళ్లడం జరిగింది.చేతులకు గ్లౌవుజులు.. ఒంటి మీద పీపీఈ కిట్ ధరించిన రాఖీ సావంత్.. ఓ కూరగాయల బండి దగ్గరకు వెళ్లి బేరమాడి.. మంచి ధర చెల్లించి మరి కూరగాయలు కొనుక్కుంది.
ఈ సమయంలో కూరగాయలమ్మే వ్యక్తిని కూడా మాస్క్ సరిగా ధరించమని సూచించింది.ఇక రాఖీ సావంత్ అంతా అయిపోయాక ‘‘ఇన్ని కూరగాయలకు కేవలం మూడు వందల రూపాయలు మాత్రమేనా.. నా జీవితంలో ఇన్ని ఎక్కువ ఐట్సెం ఇంత తక్కువ ధరకు ఎప్పుడు కొనలేదు’’ అంటూ పెద్దగా అరిచి సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది.బయటకు వెళ్లినప్పడు పీపీఈ కిట్ ధరించి వెళ్లడం చాలా మంచిది అంటూ అభిమానులకు సూచించారు.రాఖి సావంత్ చేసిన ఈ మంచి పనికి నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు.