
అల్లు అర్జున్ దిల్ రాజ్ ల మధ్య పెరుగుతున్న దూరం ?
దర్శకుడు వేణు శ్రీరామ్ బన్నీకి కథ వినిపించగా ఓకే చెప్పడంతో ఇక ఈసినిమా మొదలు కావడమే అని అందరు అనుకున్నారు. అయితే ‘అల వైకుంఠ పురములో’ మూవీ తరువాత ఇప్పుడు బన్ని ఆలోచనలు అన్ని మారిపోయి తన మూవీ ప్రాజెక్ట్స్ అన్ని పాన్ ఇండియా ఇమేజ్ తో ఉండాలని తీసుకున్న నిర్ణయంతో ‘ఐకాన్’ మరుగున పడిపోయింది అంటారు. ఇప్పుడు శ్రీరామ్ వేణు దిల్ రాజు కాంబోలో వచ్చిన ‘వకీల్ సాబ్’ కు మంచి టాక్ రావడంతో ఇప్పుడు మళ్లీ ‘ఐకాన్’ చర్చలలోకి వచ్చింది.
వాస్తవానికి దిల్ రాజ్ తమ నెక్స్ట్ మూవీ ‘ఐకాన్’ అని ఓపెన్ గానే చెప్పాడు. అయితే అందులో చిన్న లాజిక్ ఉంది. తమ బ్యానర్ లో నెక్స్ట్ సినిమా ‘ఐకాన్’ అన్నాడుగానీ అందులో హీరో అల్లు అర్జున్ అని చెప్పలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈప్రాజెక్ట్ లో నటించడానికి బన్నీ నో చెప్పినట్టుగా తెలుస్తోంది. ‘అల వైకుంఠ పురము’ లో చిత్రంతో తన స్టార్ డమ్ మరింతగా పెరిగిందని బన్నీ భావిస్తూ తన రెమ్యునరేషన్ పెంచడమే కాకుండా ఈమూవీ స్క్రిప్ట్ లో ఇప్పుడు మార్పులు చేయమని చెప్పినట్లు టాక్.
దీనితో ఈవిషయం పై బన్ని దిల్ రాజ్ ల మధ్య చిన్న గాప్ ఏర్పడటంతో ఈ కథకు సూట్ అయ్యే హీరోను వెతికే పనిలో పడినట్లు తెలుస్తోంది. దీనితో బన్ని ఈవిషయం పై ఎటూ తేల్చకుండా దిల్ రాజ్ బన్నీని ఎప్పుడు అడిగినా చూస్తా చేస్తా అంటున్నాడే తప్ప ఏదీ ఖచ్చితంగా చెప్పడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. తనకు కథ నచ్చకపోయినా లేక డేట్ల సమస్య ఉన్నా ఆ విషయం చెపితే బాగుంటుంది కానీ ఇలా ఏదీ తేల్చక పోవడంతో దిల్ రాజ్ అసౌకర్యానికి గురి అవుతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు హడావిడి చేస్తున్నాయి..