విజయ్ సేతుపతిని అంతలా అవమానించారా..!

Divya

హీరోగా విజయ్ సేతుపతి సినిమాలు తీసినా అతనికి పెద్దగా పాపులారిటీ రాలేదు. కానీ విలన్ పాత్రలో అతను అందరినీ ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా అద్భుతమైన నటుడు అని కూడా పొగిడేస్తున్నారు. అయితే అతని కోసం ప్రత్యేకంగా కథలు,పాత్రలు కూడా రాస్తున్నారు. అయితే ఇదంతా ఇప్పుడు. మన ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో విజయ్ సేతుపతి పరిస్థితి ఏంటి? ఎలా ఉండేవాడు అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం.


విజయ్ సేతుపతి ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో అందరిలాగే తను కూడా మాటలు పడ్డాడు. కోపాలు, అరుపులు,ఏడుపులు కూడా చాలానే ఉన్నాయట. వీటన్నిటినీ దాటి వచ్చాడు కాబట్టే.. ఇప్పుడు ముక్కల్ సెల్వన్ అయ్యాడు. ఇతను జాతీయ అవార్డు కూడా పొందాడు. 2010 లో రామస్వామి అనే కొత్త దర్శకుడు విజయ్ కుమార్ కు ఒక స్క్రిప్టు ఇచ్చి చదవమన్నాడుట. మూడు రోజుల తర్వాత ఫోన్ చేసి ఆ కథలో హీరోని నేనేనని చెప్పాడట. అదే'తెన్ మేర్కు పరువకాట్రు'. ఆ సినిమా కమర్షియల్ గా హిట్ సాధించింది. అంతే కాకుండా ఈ సినిమా మూడు జాతీయ అవార్డులను కూడా అందుకుంది.

 ఈ సినిమా విజయం సాధించిన తర్వాత  విజయ్ కు దశ తిరిగిపోయింది అనుకుంటున్నారేమో. క ఇక అప్పుడు కూడా విజయ్ సేతుపతి కూడా అలానే అనుకున్నాడు. కానీ దశ తిరగలేదు. తన అవమానాలు కంటిన్యూ అయ్యాయి.'తెన్ మేర్కు పరువకాట్రు' సినిమా హిట్ అయ్యాక కొంతమంది నిర్మాతలు విజయ్ దగ్గరకొచ్చారు. ఆయన ఎంత తక్కువ రెమ్యునేషన్ చెప్పినా . నీకు అంత మార్కెట్ లేదు అనేవారట. కానీ కథ నచ్చితే ఫ్రీగా అయినా చేస్తానని అనే వాడట. 'నీ మొహానికి కథ కూడా చెప్పాలా ' అని అవమానించే వారట. అయితే విజయ్ సేతుపతి మాత్రం కథ చెప్పాలనే పట్టుబట్టే వారట.


ఇక ఆ సమయంలోనే 'పిజ్జా' కథతో కార్తీక్ సుబ్బరాజ్ వచ్చాడు. అప్పట్లోనే విజయ్ టీవీ లో పనిచేసేవాడు కాబట్టి విజయ్ కి కార్తీక్ తెలుసు. ఇక పిజ్జా సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇక ఆ తర్వాత విజయ్ సేతుపతి వెనుక తిరక్కుండా సినిమా చేసుకుంటూనే వున్నాడు. ఇప్పుడు ఏ విలన్ పాత్ర కైనా ముందుగా దర్శకనిర్మాతలకు గుర్తుకు వచ్చే పేరు విజయ్ సేతుపతి. అంతలా ఆయన దశ తిరిగిపోయింది అని చెప్పవచ్చు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: