ఈ స్టార్ హీరోయిన్ల టాటూస్ వెనుక ఎంత కథ ఉందో తెలుసా..!

Divya

ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు టాటూ వేయించుకోవడం ఫ్రెండ్ గా మారిపోయింది. మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లు టాటూస్ వేయించుకోవడం అనేది కొత్త విషయమేమీ కాదు. కానీ ఎక్కడ పడితే అక్కడ వేయించుకుంటుంటారు. మరి కొంతమంది పేర్లు రాయించుకుంటూ ఉంటారు. అయితే ఈ స్టార్ హీరోయిన్ల టాటూస్ ఎందుకు వేయించుకున్నారో, దీని వెనుక ఎంత కథ ఉందో అనేది  ఒకసారి  చూద్దాం..


సినీ ఇండస్ట్రీలో హీరోలలో నాగార్జున, హీరోయిన్లలో త్రిష వంటి వారి దగ్గర నుంచి మనం ఈ ట్రెండ్ ను చూస్తూనే ఉన్నాం. అయితే ఆ తర్వాత చాలామంది హీరోయిన్లు కూడా టాటూస్ వేయించుకున్నారు. వారిలో ఎక్కువగా సమంత, నయనతార, రష్మిక టాటూ లు ఎక్కువగా హైలెట్ గా నిలుస్తున్నాయి. వారికి సంబంధించి టాటూస్ ఫోటోలను సోషల్ మీడియాలో నెటిజన్లు షేర్ చేస్తూనే ఉన్నారు.

అయితే సమంత ఒంటిపై 3 టాటూలు ఉన్నాయి. (YMC) అనే టాటూస్ సమంత వీపుపై ఉండటాన్ని మనం గమనించవచ్చు. దానికి అర్థం ఏమిటంటే. 'ఏ మాయ చేశావే'తన భర్త నాగచైతన్య తో కలిసి సమంత నటించిన మొదటి సినిమా అది. ఇదే కాకుండా తన భర్త పేరు'చెయ్' అని కూడా తన నడుము పై వేయించుకుంది. అయితే మరో టాటూ  తన రిస్ట్ పై ఉంటుంది. అది ఓ క్రియేటివ్ సింబల్ అట.


ఇక మరో యంగ్ స్టార్ హీరోయిన్ రష్మిక. కుడి చేతి పై కూడా ఒక టాటూ ఉంటుంది.'ఇర్ రిప్లేసబుల్'అనే పదాన్ని ఆమె టాటూ వేయించుకుంది. దీనికి మీనింగ్ '  సాటిలేనిది 'అని అర్థం.


ఇక సీనియర్ హీరోయిన్లలో లేడీస్ సూపర్ స్టార్ నయనతార ఒంటిపై కూడా ఒక టాటూ ఉంది. ఈమె ప్రభుదేవాతో డేటింగ్ లో ఉన్న సమయంలో లో 'P'అనే లెటర్ ను టాటూ గా వేయించుకుంది. కానీ ప్రభుదేవాతో పెళ్లి వరకు వచ్చి బ్రేకప్ అయిన తర్వాత. ఆ'P' సింబల్ ని పాజిటివ్ గా మార్చేసుకుంది ఈమె..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: