టాలీవుడ్ థియేట్రికల్ బిజినెస్ కి కొండంత అండగా నిలుస్తున్న చిన్న సినిమాలు..?
శేఖర్ కమ్ముల రూపొందించిన లవ్ స్టోరీ సినిమా ఏప్రిల్ 16వ తేదీన విడుదల కావలసి ఉంది కానీ కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కారణంగా వాయిదా పడింది. నాని హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. దీంతో భారీ సినిమాల విడుదల తేదీలు వాయిదా పడుతుండటంతో థియేట్రికల్ బిజినెస్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
గత ఏడాది థియేటర్లు నడవక యజమానులు బాగా నష్టపోయారు. కానీ ఈ ఏడాది మంచి హిట్ సినిమాలతో థియేట్రికల్ బిజినెస్ బ్రహ్మాండంగా ప్రారంభమయ్యింది. అయితే ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా మళ్ళీ థియేటర్ల బిజినెస్ పై నెగిటివ్ ప్రభావం పడుతోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ థియేట్రికల్ బిజినెస్ కి కొండంత అండగా చిన్న సినిమాలు నిలుస్తున్నాయి.
ఈ నెలలో జాంబి రెడ్డి ఫేమ్ హీరోగా నటించిన "ఇష్క్: నాట్ ఎ లవ్ స్టోరీ" ఏప్రిల్ 23 వ తేదీన విడుదల కానుండగా.. ఏక్ మినీ కథ సినిమా ఏప్రిల్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు మరికొన్ని చిన్న సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో కొన్ని సినిమాలు అయినా పాజిటివ్ టాక్ పొందితే సినిమా థియేటర్ల వ్యాపారానికి అంతగా నష్టం వాటిల్లదు. మరి చిన్న సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయగలవా లేదా అనేది కొద్ది రోజుల్లోనే తెలియనుంది.