కొరటాల సినిమా చేసే ముందు ఆ షోని ఫినిష్ చెయ్యాలని చూస్తున్న తారక్...
కొరటాల ఎన్టీఆర్ సన్నిహితుడు కావడంతో కథ వినకుండానే హడావుడిగా సినిమా ప్రకటించేశారని ఎవరికైనా చాలా సులభంగానే అర్థమవుతుంది. ఈ క్రమంలో సినిమా పూర్తి కథ సిద్ధం కాలేదట.ప్రస్తుతం కొరటాల శివ 'ఆచార్య' పనుల్లో బిజీగా ఉన్నాడు. అందుకే ఎన్టీఆర్కు తన దగ్గరున్న ఓ సినిమా పాయింట్ చెప్పి ఓకే చేసుకున్నాడట. 'ఆచార్య' పనులు పూర్తయ్యాక ఎన్టీఆర్ సినిమా పనులు మొదలుపెడతాడు. 'ఆచార్య' పనులు అవ్వడానికి, ఎన్టీఆర్ కోసం పూర్తి కథ సిద్ధం చేసుకోవడానికి కనీసం మూడు, నాలుగు నెలలు అయితే పడుతుంది. మరి ఈ గ్యాప్లో ఎన్టీఆర్ ఏం చేస్తాడు అనేదే ఇక్కడ ప్రశ్నగా మారింది. అయితే ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ తాను ఈమధ్య ప్రకటించిన "ఎవరు మీలో కోటేశ్వరులు" షో ని పూర్తి చెయ్యాలని భావిస్తున్నాడట. ఆ లోపు కొరటాల ఎన్టీఆర్ కోసం మంచి కథను సిద్ధం చేసుకొని వస్తే ఆది చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడట మన యంగ్ టైగర్.మరి చూడాలి ఎన్టీఆర్ ప్లాన్ ఎలా ఉంటుందో..