అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది పాపులారిటీ సంపాదించుకున్నారు. హౌస్ లోకి సినీ నటులతో పాటు సోషల్ మీడియా సెలబ్రెటీలు సీరియల్ నటీనటులు కూడా ఎంట్రీ ఇస్తుంటారు. అయితే సినిమాల్లో నటించిన వారికి కొంత ఫేమ్ ఉంటుంది కానీ సోషల్ మీడియా మరియు సీరియల్స్ నుండి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారికి సినిమా నటులకు ఉన్నంత క్రేజ్ పాపులారిటీ ఉండదు. అయితే హౌస్ లో టాలెంట్ చూపించిన వారు మాత్రం తక్కవ కాలంలోనే పాపులర్ అవుతుంటారు. అలా క్రేజ్ సంపాదించుకున్నవారిలో బిగ్ బాస్ 4 రన్నరప్ అకిల్ సార్థక్ ఒకరు. అఖిల్ హౌస్ లోకి రాకముందు సీరియల్ హీరోగా నటించారు. కానీ అంతగా గుర్తింపు లభించలేదు. అయితే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారానికే అఖిల్ తెగ పాపులర్ అయ్యారు. మోనాల్ తో అఖిల్ ఫ్రెండ్ షిప్ తరవాత బిగ్ బాస్ లోనే హాట్ టాపిక్ అయ్యారు. దాంతో అకిల్ మోనాల్ జంటకు ఎంతో మంది అభిమానులు అయ్యారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో ఎంతో మంది అభిమానులను సంపాధించుకున్నారు. ఇక అలా వచ్చిన షేమ్ తోనే అఖిల్ బిగ్ బాస్ విన్నర్ అవ్వకపోయినా టాప్ 2 లో నిలిచాడు.
దాంతో భయటకు వచ్చిన తరవాత కూడా అఖిల్ ఫుల్ బిజీ అయ్యాడు. టీవీ షోలతో పాటు సీరియల్స్ లో అవకాశాలు దక్కించుకున్నాడు. అంతే కాకుండా మోనాల్ గజ్జర్ హీరోయిన్ గా అఖిల్ సార్థక్ హీరోగా ఓ వెబ్ సిరీస్ ను కూడా మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ దశలో ఉంది. ఇక ఇప్పడు అఖిల్ డెబ్యూ మూవీతో హీరోగా పరిచయం అవ్వబోతున్నారు. "ఫస్ట్ టైమ్" అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి హేమంత్ దర్శకత్వం తో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుతూ అఖిల్ ఓ ఇంటర్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక ఇప్పటి వరకు మొత్తం 26 కథలు విన్నానని అన్నారు. కానీ వాటిలో ఒక్కటి కూడా నచ్చలేదని అందుకే రిజెక్ట్ చేశానని చెప్పారు. కానీ ఫస్ట్ టైమ్ అనే సినిమా కథ బాగా నచ్చిందని..వినూత్నంగా ఉంటుందని అన్నారు. అందుకే ఓకే చెప్పానని తెలిపారు. ఇక అఖిల్ చేసిన కామెంట్లపై ఇప్పుడు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. 26 సినిమాలు రిజెక్ట్ చేయడం ఏంటి బాసూ కొంచెం అతిగా అనిపించడం లేదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.