బన్నీతో సినిమా చెయ్యటం కొరటాలకి అసలు ఇష్టం లేదా?

Purushottham Vinay
కొరటాల శివ ఎట్టకేలకు తారక్ 30 వ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.ఇక #NTR30 సినిమా ప్రకటన ఇప్పుడు టాలీవుడ్‌లో మరో చర్చకు దారి తీసింది. త్రివిక్రమ్‌ సినిమా ఎందుకు ఆగిపోయింది అనే ప్రశ్నకు సరైన సమాధానం ఇంకా దొరక్క ముందే, అల్లు అర్జున్‌ సినిమా ఉంటుందా అనే ప్రశ్న మొదలైంది. అల్లు అర్జున్‌ - కొరటాల కాంబోలో ఓ సినిమా ఉంటుందని గతంలో ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు చర్చ ఆ సినిమా గురించే.రాజకీయం నేపథ్యంలో అల్లు అర్జున్‌తో కొరటాల సినిమా చేస్తారని కొన్ని నెలల క్రితం ప్రకటన వచ్చింది. యువ సుధ ఆర్ట్స్‌, జీఏ2 పిక్చర్స్‌ ఆ సినిమాను నిర్మిస్తాయని ప్రకటించారు.'పుష్ప' పూర్తయ్యాక ఈ సినిమా పట్టాలెక్కిస్తారని చెప్పారు. తీరా చూస్తే ఇప్పుడు కొరటాల.. ఎన్టీఆర్ సినిమా పనిలో పడ్డాడు.


జూన్‌లో సినిమా పనులు మొదలవుతాయని చెప్పారు. దీంతో అల్లు అర్జున్‌ సినిమా లేనట్లే అంటూ వార్తలొస్తున్నాయి. ఆ సినిమా నిర్మాణ సంస్థల్లో ఒకటైన యువ సుధ .. ఇప్పుడు ఎన్టీఆర్‌ సినిమాకు నిర్మాతగా ఉండటం ఒక కారణమైతే… ఎన్టీఆర్‌ సినిమా కూడా రాజకీయం నేపథ్యంలోనే ఉంటుందని వార్తలు రావడం మరో కారణం.బన్నీతో అనుకున్న కథనే ఎన్టీఆర్‌తో కొరటాల చేస్తున్నాడా అనే పుకార్లు మొదలయ్యాయి. దీన్ని బట్టి చూస్తుంటే కొరటాల శివ కు అసలు బన్నీతో సినిమా చెయ్యడం ఇష్టం లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఎందుకంటే గతంలో కొరటాల పెద్ద డైరెక్టర్ కాక ముందు సూపర్ స్టార్ మహేష్ తో తీసిన ఇండస్ట్రీ హిట్ సినిమా మొదట బన్నీకె చెప్పాడట. ఆ టైంలో బన్నీ కొరటాలని పట్టించుకోకుండా ఈ సినిమాకి నో చెప్పాడట.. అందుకని కొరటాల బన్నీతో సినిమా చెయ్యడానికి ఇష్టపడట్లేదని వార్తలు వస్తున్నాయి. మరి నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చెయ్యక తప్పదు. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన గాసిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన గాసిప్స్ గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: