ప్రభాస్ కంటే ముందే అనుష్క ఆ ఇద్దరితో ఎఫైర్..ఎవరంటే..?
చిన్న హీరో, పెద్ద హీరో అనే తేడా లేకుండా అందరి తో నటించి కొద్దీ సమయంలో టాప్ హీరోయిన్ అయిపొయింది.. ఇప్పటికీ టాలీవుడ్ లో ఆమె హవా కొనసాగుతుందంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ లో అనుష్క కెరీర్ దాదాపు ముగింపుకు వచ్చేసిందని చెప్పొచ్చు.. ఒకటో రెండో సినిమాలు అవికూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి ఇప్పుడు.. ఈనేపథ్యంలో ఆమె ఎఫైర్ ల గురించి ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ జరుగుతుంది..
ఇన్నాళ్లు అనుష్క ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటుందని భావించారు. కానీ ఎందుకో అది ఇప్పటికీ జరగలేదు. అయితే ప్రభాస్ కంటే ముందే ఓ ఇద్దరు వ్యక్తులతో అనుష్క పెళ్లి అంటూ వార్తలు రావడం విశేషం. వారిలో ఒకరు హీరో గోపీచంద్ కాగా, మరొకరు సినిమాటోగ్రాఫర్ కె కె సెంథిల్ కుమార్.అనుష్క, గోపీచంద్ మధ్య ప్రేమ చిగురించినట్లు, పెళ్లి కూడా చేసుకోనున్నారని వరుస కథనాలు రావడం జరిగింది.వెండితెరపై వీరిద్దరి కెమిస్ట్రీ కూడా అద్భుతంగా ఉన్న నేపథ్యంలో, ప్రేక్షకులు సైతం వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అన్నారు. కానీ 2013లో గోపీచంద్ శ్రీకాంత్ మేనకోడలిని వివాహం చేసుకున్నారు. ఇక రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్ కె కె సెంథిల్ కుమార్ , అనుష్క ప్రేమించుకున్నారంటూ ఓ పదేళ్ల క్రితం వార్తలు వచ్చాయి. సెంథిల్ కుమార్, అనుష్క పెళ్లి కథనాలు అప్పట్లో రావడం జరిగింది. కారణం ఏదైనా కానీ పెళ్లి చేసుకోవాలనుకున్న వీరు నిర్ణయం మార్చుకున్నట్లు మరలా కొన్ని వార్తలు వచ్చాయి.