వకీల్ సాబ్ ఎఫెక్ట్.. ఏకే రీమేక్ లో మార్పులు చేస్తున్న త్రివిక్రమ్..?
ఒక్కొక్కరు రెండేసి సార్లు ఈ సినిమా చూస్తుండడంతో సినిమా కలెక్షన్స్ ఉప్పెన లా వచ్చి పడుతున్నాయి.. ఐదురోజుల్లోనే సినిమా దాదాపు వంద కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది..మొత్తానికి ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ అవడంతో పాటు అదే రేంజ్ లో కూడా హిట్ అయ్యింది.. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా కి ఉన్న డిమాండ్ కారణంగా దాదాపు అన్ని థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కాగా ప్రతి సెంటర్ నుంచి సినిమా సూపర్ హిట్ అని టాక్ వచ్చింది.
ఇక ఈ సినిమా తో పవన్ క్రేజ్ వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది.. దాంతో తమ సినిమాల్లో ఆ క్రేజ్ కి తగ్గట్లు స్క్రిప్ట్ ని మార్చుకుంటున్నారు దర్శకులు.. ఈనేపథ్యంలో పవన్ తదుపతి సినిమాగా వస్తున్న ఏకే రీమేక్ లో పవన్ కోసం కొన్ని చేంజెస్ చేస్తున్నారట.. ఈ చిత్రానికి కొన్ని రిపేర్ లు చేస్తున్నారట రచయిత త్రివిక్రమ్.. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కి తమన్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమా కోసం ఇప్పటికే పాటలు కంప్లీట్ చేశాడు తమన్.. సినిమా కూడా యాభై శాతం పూర్తయ్యిందట.. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ తర్వాత రాబోతున్న ఈ సినిమా రేంజ్ లో ఉంటుందో చూడాలి.