నాకు పదేళ్లకే పెళ్లయ్యింది.. అసలు విషయం చెప్పేసిన సీనియర్ నటి..?

praveen
ప్రస్తుతం ఈ టీవీ లో ఎన్ని రకాల బుల్లితెర కార్యక్రమాలు అటు ప్రేక్షకులందరికీ వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ పంచుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ టీవీ లో టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ ప్రతివారం ప్రేక్షకులకు ఎంతగానో ఎంటర్టైన్మెంట్ పంచుతున్న షోస్ లలో టాలీవుడ్ కమెడియన్ అలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఆలీతో సరదాగా కార్యక్రమం కూడా ఒకటి. ఆలీతో సరదాగా కార్యక్రమం చూడటానికి అటు ప్రేక్షకులు అందరూ ఎప్పుడూ ఆసక్తి చూపుతుంటారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు సరికొత్త అతిథులను ఆహ్వానిస్తూ ఇక ఆసక్తికర ప్రశ్నలడుగుతూ వారి నుంచి ఎన్నో ప్రేక్షకులకు తెలియని విషయాలను కూడా బయటకు రాబడుతూ ఉంటారు వ్యాఖ్యాత అలి.

 అందుకే ఆలీతో సరదాగా అనే కార్యక్రమం వస్తుంది అంటే చాలు బుల్లితెర ప్రేక్షకులు అందరూ కూడా టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే గత వారం టాలీవుడ్లో యూత్ఫుల్ దర్శకుడిగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న శేఖర్ కమ్ముల గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇటీవల వచ్చే వారం ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ చిత్రంలో సీనియర్ నటి గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న కృష్ణవేణి డబ్బింగ్ జానకి తో కలిసి ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చారు.  తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా నెటిజన్లను ఆకర్షిస్తోంది

 తన బాల్యంలో తాను చేసిన సాహసాలు నటప్రస్థానం  గురించి ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో చెప్పుకొచ్చారు నటి కృష్ణవేణి.  అంతేకాదు పదేళ్లకే తనకు పెళ్లి కూడా జరిగిపోయింది అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇలా పదేళ్లకే పెళ్లి జరిగిపోవడంతో తోటి వాళ్ళు అందరు కూడా ఎంతగానో ఏడిపించే వాళ్ళని .. నటి కృష్ణవేణి చెప్పుకొచ్చారూ. పదేళ్ల వయసులోనే ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు నటి కృష్ణవేణి. తన వివాహం కిల్లి సంగతులు చెబుతూ ఏకంగా నవ్వులు పంచుకున్నారు. కాగా ఎపిసోడ్ మొత్తం 19వ తేదీన రాత్రి 9:30 గంటలకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: