ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ క్యాన్సిల్ కావడానికి కారణం అదేనా .... ??

GVK Writings
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితం అయిన ఆ సినిమా సూపర్ హిట్ కొట్టింది. దాని అనంతరం ఆర్ఆర్ఆర్ మూవీ చేయడానికి సిద్దమైన ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మరొక నటుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఆ మూవీ చేస్తున్నారు. కాగా ఆ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం గా నటిస్తుండగా చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు.

పేట్రియాటిక్ డ్రామా గా పలు కమర్షియల్ హంగులు కలగలిపి రాజమౌళి తీస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తుండగా దీనిని ప్రముఖ నిర్మాత దానయ్య దాదాపుగా రూ.500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కానుంది. అయితే దీని తరువాత హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలపై నిర్మితం కానున్న భారీ సినిమాలో ఎన్టీఆర్ నటించనున్నారు అంటూ ఇటీవల అధికారిక ప్రకటన రావడం జరిగింది. అయితే రెండు రోజులుగా పలు టాలీవుడ్ వర్గాలలో ప్రచారం అవుతున్న వార్తలను బట్టి చూస్తుంటే ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తో కాదని, కొరటాల శివ తో ఫిక్స్ అయిందని అంటున్నారు.

కొద్దిసేపటి లో దీనిపై అధికారిక న్యూస్ కూడా రానుంది. అయితే త్రివిక్రమ్ మూవీ క్యాన్సిల్ కావడానికి ముఖ్య కారణం, ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ ఎటువంటి కథ చేస్తే దానికి మించేలా విజయాన్ని అందుకుంటారు అనే క్లారిటీ కి త్రివిక్రమ్ రాలేకపోవడమే అని అంటున్నారు. నిజానికి ఈ సినిమా సెట్ అయిన సమయంలో త్రివిక్రమ్ చెప్పిన కథ ఎన్టీఆర్ కు నచినప్పటికీ అది ఎంతవరకు అనుకున్న అంచనాలు అందుకుంటుంది అనే అనుమానం హీరో, దర్శకుడు ఇద్దరిలో కలగడంతో ఇటువంటి పరిస్థితుల్లో సినిమా చేయడం కరెక్ట్ కాదని విరమించుకున్నట్లు టాక్. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియదు కానీ, నెక్స్ట్ మాత్రం త్రివిక్రమ్, మహేష్ తో సినిమా చేయనున్నట్లు చెప్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: