పాన్ ఇండియా సినిమాలో ఓ భారీ యాక్షన్ సీన్ పై ఊహించని గాసిప్.. ఏంటంటే.!

Suma Kallamadi
కేజీయఫ్ సినిమా గురించి తెలియని వారంటూ ఉండరు. ప్రశాంత్ నీల్ యశ్ కాంబినేషన్‌లో వచ్చిన కేజీయఫ్ సినిమా ఎన్ని రికార్డులను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. కన్నడ చిత్రాలకు అంతగా గుర్తింపులేని చోట కూడా శాండిల్ వుడ్ సత్తాను చాటారు. మొత్తంగా ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ వైపు దేశం మొత్తం తిరిగి చూసేలా చేశారు. ప్రశాంత్ నీల్ కేజీయఫ్ సీక్వల్ గా చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఇక ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ప్రతీ ఇండస్ట్రీలోనూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్లాన్ చేసిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. ఎనలేని అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం ఆల్రెడీ షూట్ అంతా కంప్లీట్ అయ్యి విడుదలకు సన్నద్ధం అయిన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే ఈ చిత్రంలో మాస్ యాక్షన్ సీక్వెన్స్ ల ఫీస్ట్ కోసం ప్రతీ ఒక్కరూ ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. మరి ఈ ఓ భారీ యాక్షన్ సీన్ కు సంబందించే ఓ ఊహించని గాసిప్ ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే ఇందులో ఎంత వరకు నిజముందో కానీ ఈ కేచిత్రంలో ఆల్రెడీ షూట్ చేసేసిన ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని మేకర్స్ మళ్ళీ రీషూట్ చెయ్యాలని భావిస్తున్నారట.
ఇక ఈసారి ఇంకా బెటర్ గా తీయాలని ప్లాన్ చేస్తున్నారని టాక్. అయితే మరోపక్క ఇవన్నీ పూర్తిగా అవాస్తవాలు అన్నట్టు కూడా మరో వెర్షన్ వినిపిస్తుంది. ఆల్రెడీ షూట్ అంతా కంప్లీట్ అయ్యిపోయింది ఎలాంటి రీ షూట్స్ లేవని మరో టాక్. ఇప్పటికే టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం మళ్ళీ మరో సీన్ కోసం షూట్ స్టార్ట్ చెయ్యడం అనేది ఎంత వరకు నిజమో కాలమే నిర్ణయించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: