ఏపీ సర్కార్ తీరు మీద సినీ ప్రముఖుల మౌనం... ఎందుకు ?

Satvika
కరోనా మహమ్మారి కారణంగా దాదాపు ఏడాది పాటు సినీ పరిశ్రమ మూగ బోయింది. ఎటువంటి సందడి లేదు. ఎన్నో సినిమాలు చిత్రీకరణ జరుపుకుంటే, మరెన్నో సినిమాలు విడుదలకు సిద్దం అయ్యాయి. అయితే సినిమా ల విడుదల పై ఇండస్ట్రీ ప్రముఖుల తెలుగు రాష్ట్రాల సీఎం లను విన్నవించారు. దాంతో రెండు రాష్ట్రాల సీఎం లు స్పందించి కరోనా నిబంధనలతో సినిమాలను విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణ వరకు అంతా బాగానే ఉంది. కానీ రీసెంట్‌గా విడుదలైన 'వకీల్‌ సాబ్‌' సినిమాపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మాత్రం ఏ ఒక్క సినీ పెద్ద ఇంత వరకు స్పందించకపోవడం విశేషం.

తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అని చెప్పుకుంటున్న మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఈ విషయంపై పెదవి విప్పకపోవడం గమనార్హం..కేవలం ఒక్క చిరు మాత్రమే కాదు .. హీరోలు కానీ, దర్శకులు, నిర్మాతలు.. అసలెవరూ ఇంతవరకు నోరు మెదపలేదు. ఎక్కడ తమ సినిమాలకు ఆటంకం కలిగిస్తారో అని ఏపీ ప్రభుత్వానికి వారు భయపడుతున్నారా? అనే విధంగా కూడా ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చలు జోరుగా సాగుతున్నాయి.

పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరో సినిమాకే ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వడం ఆలోచించాల్సిన విషయమే.. రాజకీయ కక్షలు ఉంటే అక్కడే చూసుకోవాలి.. అలా కాకుండా పొట్ట కొట్టకూడదు.. ఎప్పుడు లేని విధంగా ఏపి సర్కారు కోర్టుకు వెళ్ళడం కూడా విచిత్రం.. ఏదో చేశాడని జగన్ గ్రేట్ అంటూ చంకలు గుద్దుకున్న మెగాస్టార్ తమ్ముడు సినిమా విషయంలో మాత్రం ఎందుకు మౌనం వహిస్తున్నా డో అని గుసగుసలు వినిపిస్తున్నాయి.మెగాభిమానులు కూడా సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇతర హీరోల చిత్రాలు పైరసీకి గురైనప్పుడు పవర్‌ స్టార్‌ ముందుండి పోరాటం చేయలేదా?. మరి ఆ హీరోలకు ఇప్పుడేమైంది. రాజకీయాలు పక్కనెట్టి.. సినిమా పరంగా అయినా.. ఏపి సర్కార్ తో చర్చలు జరపాలి కదా అంటూ ప్రశ్నలు కురిపించారు. మరి ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: