ఒకప్పుడు సైడ్ యాక్టర్స్ ఇప్పుడు సూపర్ స్టార్స్...?

kalpana
 ఇండస్ట్రీలో ఎవరిని కూడా ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేం . ఎందుకంటే ఎవరీ టైమ్ ఎప్పుడు ఎలా మారిపోయిందో తెలియదు.  అలాగే ఎవరి జీవితం ఎప్పుడు ఎలా టర్న్ ఎవరు చెప్పలేరు. అయితే టాలీవుడ్ లో కొందరి విషయంలో ఇదే జరిగింది. అయితే ఒకప్పుడు సైడ్ క్యారెక్టర్లు చేస్తూ, తెరవెనుక ఉండి ఎవరూ పట్టించుకోని వాళ్ళే ఇప్పుడు సూపర్ స్టార్స్ గా అయ్యారు. సూపర్ స్టార్స్ గా చక్రం తిప్పుతున్నారు. అయితే అనామకులుగా ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడు అసాధ్యులు గా మారిపోయారు. అయితే ఒకప్పుడు సైడ్ యాక్టర్స్ గా ఉన్న వీళ్ళు ఇప్పుడు సూపర్ స్టార్స్ గా అయ్యారు. ఎవరు?ఏమిటి అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం...



 టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్  స్టార్ నాని అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. అయితే నాని హీరో కాకముందు ఢీ, రాధాగోపాలం లాంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. న్యాచురల్ స్టార్ నాని అంటే ఏ సినిమా వచ్చినా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకాన్ని ప్రేక్షకులలో కలిగించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది వరుస విజయాలు అందుకొన్నాడు నాని. రవితేజ కృష్ణవంశీ పరిచయం తో అసిస్టెంట్ డైరెక్టర్ గా మారాడు. ఆ తరువాత ఇది ఎట్ లాంటి సినిమాలతో స్టార్ అయ్యాడు. అంచెలంచెలుగా ఎదిగే మాస్ మహారాజా గా ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మొదటి సినిమా నీ కోసం సినిమాలో రవితేజ హీరోగా చేశాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం లో హీరోగా చేయగా సూపర్ హిట్ అయినా హీరోగా గుర్తింపు వచ్చి ఇది ఎంతో సెటిల్ అయ్యాడు రవ


విజయ్ సేతుపతి ధనుష్, కార్తి లాంటి హీరోల సినిమాల్లో సైడ్ రోల్స్ చేసిన విజయ్ ఇప్పుడు స్టార్ హీరోగా మారిపోయాడు. తమిళనాట మక్కల్ సెల్వన్‌గా మన్ననలు అందుకుంటున్నాడు.
విజయ్ దేవరకొండ లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌లో నెగిటివ్ రోల్ చేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఓ సూపర్ స్టార్.సాయి పల్లవి టాలీవుడ్ హైబ్రిడ్ పిల్ల  పందెంకోడి సినిమాలో మీరా జాస్మిన్ ఫ్రెండ్స్ లిస్టులో ఒకరిగా కనిపించింది సాయి పల్లవి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోయింది స్టార్ హీరోయిన్. త్రిష ప్రశాంత్, సిమ్రాన్ జంటగా నటించిన జోడీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా కనిపించింది త్రిష. కాజల్ అగర్వాల్ క్యూ హో గయా నాలో ఐశ్వర్యరాయ్ ఫ్రెండ్ పాత్రలో కనిపించింది కాజల్ అగర్వాల్. ఒకప్పుడు రెండు పాత్రల్లో కనిపించిన కాజల్ అగర్వాల్  ఎప్పుడు  టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఓ స్టార్ హీరోయిన్ గా  ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతుంది . అంతేకాకుండా పెళ్లి అయిన తరువాత  వరుస సినిమాలతో బిజీ అయిపోయింది .రితూ వర్మ పెళ్లి చూపులు కంటే ముందు బాద్షా లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది రితూ వర్మ.


రష్మి గౌతమ్ బుల్లితెర ప్రేక్షకులను అలరించే యాంకర్ .అప్పుడెప్పుడో వచ్చిన హోలీ సినిమాలో సునీల్ లవర్‌గా నటించింది రష్మి. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో అలాంటి పాత్రలే చేసింది రష్మి గౌతమ్.
అనసూయ భరద్వాజ్  నాగ సినిమాలలో కొన్ని సెకన్లపాటు మెరిసిన అనసూయ, ఇప్పుడు బుల్లితెర సూపర్ స్టార్ అయిపోయింది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇటు జబర్దస్త్ కామెడీ షో ప్రోగ్రామ్ షూటింగులతో బిజీగా ఉంటూనే అటు వెండి తెరపై తళుక్కుమని రంగమ్మత్త.తెలుగు ఇండస్ట్రీ లో శర్వానంద్ శంకర్ దాదా ఎంబిబిఎస్, సంక్రాంతి లాంటి చాలా సినిమాల్లో సైడ్ రోల్స్ చేసిన శర్వానంద్ ఇప్పుడు 25 కోట్లకు పైగానే మార్కెట్ ఉన్న క్రేజీ హీరో. నవీన్ పొలిశెట్టి లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌లో ఓ గ్యాంగ్‌కు లీడర్‌గా కనిపించిన నవీన్ పొలిశెట్టి.. చిచోరేతో బాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు.


ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో తెలుగులో విజయం అందుకున్నాడు. మొన్న జాతి రత్నాలు సినిమాతో సంచలన విజయం అందుకుని స్టార్ అయిపోయాడు ఈయన.సత్యదేవ్  ఎన్నో సినిమాల్లో చిన్న రోల్స్ చేసిన సత్యదేవ్.. ఇప్పుడు మీడియం బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు.సునీల్ కమెడియన్‌గా ఇండస్ట్రీకి వచ్చి మెల్లగా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ హీరో స్థాయికి ఎదిగాడు ఈయన. సునీల్‌కు కూడా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేడు. సొంతంగానే ఎదిగి స్టార్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: