నాని 'టక్ జగదీశ్' హిట్ అవ్వాలని.. సుడిగాలి సుధీర్ ఎంత త్యాగం చేసాడో..?

praveen
ఈ మధ్యకాలంలో బుల్లితెర కార్యక్రమాలకి ఎంతగానో క్రేజ్ పెరిగిపోయింది.  ఈ క్రమంలోనే ఇక టీవీ చానల్స్ లో నిర్వాహకులు అందరూ కూడా ఎప్పటికప్పుడు వినూత్న మైన కాన్సెప్ట్ తో కూడిన కార్యక్రమాలను బుల్లితెర ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇప్పటికే ఈ టీవీ లో ఎన్నో రకాల బుల్లితెర షో స్ వస్తున్నాయి. ఇక ప్రతి షో కూడా ఎంతగానో ప్రేక్షకులను అలరిస్తుంది. సాధారణంగా ఈ టీవీ నిర్వాహకులు అందరూ కూడా ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు ఒక స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేస్తూ ఉంటారు.


 ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో రాబోతున్న ఉగాది పండుగకు కూడా ఒక స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేసారు ఈటీవీ నిర్వాహకులు. ఇక ఈ స్పెషల్ షో కి ఉగాది జాతి రత్నాలు అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ఈ షో కి సంబంధించి వరుసగా ప్రోమో విడుదల చేస్తున్నారు.  అటు ప్రేక్షకుల్లో ఈ షో పై మరింత  ఆసక్తి పెంచుతున్నారు.  అయితే ఇప్పటికే ఈ షో కి సంబంధించి విడుదలైన ఒక ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కాగా ఇటీవలే మరో ప్రోమో కూడా విడుదల చేశారు.  ఇక ఈ ప్రోమో చూస్తూ ఉంటే ఉగాది కి ఎంటర్టైన్మెంట్ పిక్స్ లో ఉండబోతుంది అన్నది అర్థం అవుతుంది.



 అయితే ఇటీవలే ప్రోమో లో భాగంగా టాక్ జగదీశ్ సినిమా హీరో హీరోయిన్లు నాని రీతు వర్మ ఎంట్రీ ఇచ్చారు.  ఈ క్రమంలోనే వారు కూడా ఇక జబర్దస్త్ కమెడియన్స్ అందరూ చేసిన కామెడీని తెగ ఎంజాయ్ చేశారు. అయితే ఇటీవల విడుదలైన ప్రోమో లో భాగంగా టక్ జగదీష్ సినిమా హిట్ కావాలని సుడిగాలి సుదీర్ ఒక పెద్ద త్యాగమే చేశాడు అనే చెప్పాలి. ఏకంగా జగదీష్ సినిమా మంచి విజయాన్ని సాధించాలి అని  వేపాకును నమిలేసాడు సుడిగాలి సుదీర్. దీంతో  ఇది చూసిన నాని కూడా ఆశ్చర్య పోయాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: