ప్రభాస్ క్యారెక్టర్ ని బయటపెట్టిన కమెడియన్....
ప్రముఖ కమెడియన్ ప్రభాస్ శ్రీను ప్రభాస్ కు సన్నిహితుడు కాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ శ్రీను ప్రభాస్ మొహమాటం అతని క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ప్రభాస్ బీ గోపాల్ దర్శకత్వంలో నటించిన అడవిరాముడు సినిమాలో ప్రభాస్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమాలో ప్రభాస్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ తో ఒక ముద్దు సన్నివేశంలో నటించాల్సి ఉండగా ఆ సీన్ చేయడం కొరకు తండ్రికి ప్రభాస్ ఫోన్ చేసి అనుమతి తీసుకున్నారని ప్రభాస్ శ్రీను వెల్లడించారు.తండ్రి అనుమతి ఇచ్చిన తరువాతే ప్రభాస్ ఆ సన్నివేశంలో నటించాడని ప్రభాస్ శ్రీను తెలిపారు. తల్లిదండ్రులు అంటే ఎంతో గౌరవ మర్యాదలు ఉన్న ప్రభాస్ సీన్ లో నటించడం కొరకు తండ్రి అనుమతి అడగటం నిజంగా ప్రభాస్ సూపర్ క్యారెక్టర్ ఏంటో తెలియజేస్తుంది.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...