బాలీవుడ్ మొట్టమొదటి స్వలింగ సంపర్క జోడీ ఎవరో తెలుసా...?
ఈ విషయంపై శనివారం నాడు సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చిన అపూర్వ అస్రానీ ‘మా ప్రయాణంలో కొన్ని తప్పులు చేశాం’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని వ్యక్తం చేశాడు. తమ ఇన్నేళ్ల బాంధవ్యానికి ఈరోజుతో ముగింపు పలుకుతున్నట్లు చెప్పుకొచ్చారు అస్రానీ. అంతే కాదు అది కూడా ఇద్దరి ఇష్టంతో... స్నేహపూర్వకంగానే స్పష్టం చేశారు. అంతేకాకుండా దీంతో పాటు ఓ నోట్ ను కూడా జత చేశారు. అందులో ఏమని చెప్పారంటే...
‘‘నేను, సిద్ధాంత్ విడిపోవాలని నిర్ణయించుకున్న ఈ విషయాన్ని ప్రకటించడానికి చాలా బాధపడుతున్నాను. దేశంలో చాలా మంది ఎల్‌జీబీటీక్యూ కపుల్స్‌కి మేం ఆదర్శంగా నిలిచాం. ఈ విషయం వారందరికీ ఎంతో బాధ కలిగించవచ్చు, నిరాశపరచవచ్చు. కానీ ఈ 14 ఏళ్ల కాలంలో ప్రతి రోజు ఎంతో ముఖ్యమైనది.. విలువైనది.
ఇన్నేళ్ల తర్వాత మేం స్నేహపూర్వకంగానే విడిపోతున్నాం’’ అని తెలిపారు. మన దేశంలో స్వలింగ సంపర్క జంటకు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో...? ఎన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుందో...? అందరికీ తెలిసిందే... అయినా సరే..మేం ఏర్పాటు చేసుకున్న ఈ ప్రత్యేకమైన మార్గంలో కొన్ని తప్పులు చేశాం. స్వలింగ సంపర్కులమైనప్పటికీ ఈ విషయాన్ని ఎంతో ధైర్యంతో మనస్ఫూర్తిగా బాహ్య ప్రపంచానికి ప్రకటించాం. ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి తరం ఎల్‌జీబీటీక్యూ జంట మాదే. అయితే మా జీవితంలో కూడా ఎన్నో మలుపులు వచ్చాయి.. దాంతో ఇప్పుడు విడిపోక తప్పడం లేదు. ఇలాంటి కష్టమైన సమయంలో మా గోప్యతని, మనోభావాలని అందరూ గౌరవించి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఎలాంటి ఊహాగానాలను ప్రచారం చేసి మాకు బాధ కలిగించవద్దని అభ్యర్థిస్తున్నాను. మీ మెసేజ్‌లలో కూడా మమ్మల్ని దయచేసి ట్యాగ్ చేయకండి. భవిష్యత్తుపై నమ్మకం ఉందనే మాటతో దీన్ని ముగించాలనుకుంటున్నాను. సిద్, నేను అనే కాదు మాలో ప్రతి ఒక్కరం కోరుకునేది ప్రేమ, కమిట్‌మెంట్, సురక్షితమైన నివాసం. నమ్మకంపై ఆశలు వదులుకోకండి’’ అంటూ నోట్లో చెప్పుకొచ్చారు..అపూర్వ అస్రానీ...