
నితిన్ కి జోడీగా సారంగదరియా...?
వాస్తవానికి ఈమెతో సినిమాలు చేయడానికి వెయిట్ చేస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సాయిపల్లవి.. చేతి నిండా సినిమాలతో బిజీగా దూసుకుపోతోంది. ఈమె నటించిన లవ్ స్టోరీ' .. 'విరాటపర్వం' సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని సరసన చేస్తున్న 'శ్యామ్ సింగ రాయ్' షూటింగు జరుపుకుంటోంది. ఈ చిత్రం తర్వాత సాయి పల్లవి తదుపరి ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో యంగ్ హీరో నితిన్ తో జత కట్టడానికి రెడీ అయిందట ఈ భామ. అయితే ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
మరో వైపు హీరో నితిన్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. తాజాగా రంగ్ దే సక్సెస్ తో ఫుల్ ఖుషీ గా ఉన్న నితిన్..మేర్లపాక గాంధీ దర్శకుడిగా 'మాస్ట్రో' సినిమాను ఖరారు చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీని తర్వాత మరో ప్రాజెక్ట్ కు ఓకే చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో సాయి పల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. ప్రస్తుతం ఈమె నటించిన లవ్ స్టోరీ సినిమా త్వరలో విడుదల కానున్నది. ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ అంచనాలను లవ్ స్టోరీ అందుకుంటుందో లేదో చూడాలి.