కొత్త బైక్ కొన్న బిగ్ బాస్ కంటెస్టెంట్... ఎన్ని లక్షలో తెలుసా..?
బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతోమందికి మంచి గుర్తింపును సంపాదించి పెట్టింది. బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఎంతోమంది కంటెస్టెంట్ లు ప్రస్తుతం ఎన్నో అవకాశాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ లో ఒకరైన అఖిల్ బిగ్ బాస్ లో పాల్గొనక ముందు పలు సినిమాలలో సైడ్ క్యారెక్టర్లు చేస్తూ, పలు బుల్లితెర సీరియల్స్ లో విలన్ పాత్రలను పోషించేవారు. కానీ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్ళిన అఖిల్ బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇకపోతే అఖిల్,మోనాల్ ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకున్నాడు.
ప్రస్తుతం ఈ ఇద్దరు బిగ్ బాస్ కంటెస్టెంట్ లు పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, వెబ్ సిరీస్ లో చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అఖిల్ కారును కొనాలనే కోరికను నెరవేర్చుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే కొన్ని రోజుల క్రితం కారును కొని తన కలలను సాకారం చేసుకున్న అఖిల్ తాజాగా తనకెంతో ఇష్టమైన బండిని కొన్నారు. ఈ యంగ్ యాక్టర్ లేటెస్ట్ జావా బైక్‌ను సొంతం చేసుకున్నాడు. దీని ధర 2.30 వరకు ఉన్నట్లు సమాచారం.
అఖిల్ తనకెంతో ఇష్టమైన బండిని కొని బండి పై కూర్చొని ఉన్నటువంటి ఫోటోలను, వీడియోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ.. నా కలను నిజం చేసిన ఆ దేవుడికి, తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. నన్ను ఈ విధంగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థాంక్యూ సోమచ్ అంటూ తెలియజేశారు. ప్రస్తుతం అఖిల్ బండికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకున్నాయి.