షర్ట్ విప్పితే కిస్, హగ్ ఇస్తాను.. ప్రియమణి భలే ఛాన్స్ ఇచ్చిందే..?

praveen
ఈ మధ్యకాలంలో బుల్లితెర కార్యక్రమాల క్రేజ్ అంతకంతకూ పెరిగి పోయింది అయితే ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమయ్యే పలు రకాల షోస్ కి ఎంతగానో క్రేజ్ ఉంది.  ఈటీవీ లో ప్రసారమయ్యే డాన్స్ రియాలిటీ షో ఎన్నో ఏళ్ల నుంచి టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ ప్రేక్షకులందరినీ అలరించి తీసుకుపోతుంది. ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై డాన్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ఢీ షో .  ప్రతి వారం కూడా ఢీ షో కంటెస్టెంట్స్ అందరూ కూడా సరికొత్త డాన్స్ పర్ఫార్మెన్స్ లతో ముందుకు వచ్చి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు.



 కేవలం ఢీ షో లో అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు.. ఇక ఆకట్టుకునే కామెడీ కూడా ఉంటుంది. ఇలాంటి ఢీ షో లో డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి ఆశ్చర్యపోయిన ప్రేక్షకులందరూ ఇక ఆ తర్వాత ఉన్న కామెడీతో కడుపుబ్బా నవ్వుకుంటూ ఉంటారు. అందుకే ఢీ షో రోజురోజుకూ క్రేజ్ సంపాదిస్తూ దూసుకుపోతుంది.  ఇకపోతే ఈ ఢీ షో లో భాగంగా టీం లీడర్లు గా ఉన్న సుడిగాలి సుధీర్ హైపర్ ఆది అప్పుడప్పుడు జడ్జ్ లతో పులిహోర కలుపుతూ ఉంటారు. హగ్ కావాలని లేదా కిస్ కావాలి అంటూ జడ్జీగా ఉన్న పూర్ణ లేదా ప్రియమణి ని అడుగుతూ ఉంటారు.



 ఇటీవల విడుదలైన ప్రోమో లో భాగంగా హైపర్ ఆది కి ఒక అదిరిపోయే ఛాన్స్ ఇచ్చింది ప్రియమణి. ఇటీవల విడుదలైన  ప్రోమో కాస్త నెటిజన్లను తెగ ఆకర్షిస్తూ ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.  ప్రోమో లో భాగంగా..  ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఎంతగానో నచ్చడంతో ప్రియమణి ఏకంగా ఆ కంటెస్టెంట్ ని దగ్గరికి పిలిచి  ఆ తర్వాత కిస్ హగ్ కూడా ఇస్తుంది. అయితే మాకు కూడా ఇవ్వాలి అని సుడిగాలి సుధీర్ హైపర్ ఆది కోరగా.. మీరు కూడా షర్ట్ విప్పి బెల్లీ డాన్స్ చేస్తే అప్పుడు మీకు కూడా ఇస్తాను అంటూ చెబుతుంది. ఈ క్రమంలోనే ఏకంగా హైపర్ ఆది షర్ట్ విప్పేందుకు సిద్ధమయ్యాడు  . దీంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: