సినిమాలో హీరోయిన్ కి చెల్లెలుగా నటించిన హీరోయిన్లు వీళ్ళే..
1) కాజల్ అగర్వాల్-సింధు మీనన్:
కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం చందమామ సినిమాలో కాజల్ అగర్వాల్ చెల్లెలు పాత్రలో సింధుమీనన్ ఎంతో అద్భుతంగా నటించారు.
2) ప్రణీత-సమంత:
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలో ప్రణీత చెల్లెలి పాత్రలో హీరోయిన్ సమంత ఎంతో అద్భుతంగా నటించారు.
3) శ్రీయ-జెనీలియా:
ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఎన్టీఆర్ నా అల్లుడు చిత్రంలో అక్క చెల్లెలు పాత్ర పోషించారు.
4) పూజా హెగ్డే-ఈషా రెబ్బ:
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రంలో ఈ ఇద్దరు హీరోయిన్లు అక్కచెల్లెళ్ల పాత్రలో సందడి చేశారు.
5) త్రిష-సంజన:
పూరి దర్శకత్వంలో తెరకెక్కిన బుజ్జిగాడు చిత్రంలో త్రిష చెల్లెలి పాత్రలో సంజన నటించారు.
6) హన్సిక- షీలా:
ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన మస్కా చిత్రంలో హన్సిక చెల్లెలి పాత్రలో షీలా నటించారు.
7) తమన్నా-ఆండ్రియా:
తడాఖా సినిమాలో ఆండ్రియా చెల్లెలి పాత్రలో మిల్క్ బ్యూటీ తమన్నా సందడి చేశారు.
8) టబు-ఐశ్వర్యరాయ్-బేబీ షామిలి:
ఈ ముగ్గురు హీరోయిన్లు కలిసి ప్రియురాలు పిలిచింది సినిమాలో అక్క చెల్లెలపాత్రలో నటించారు.
వీరు మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది హీరోయిన్లు ఓకే సినిమాలో అక్క చెల్లెలి పాత్రలో నటించి మెప్పించారు.