బ్రేకింగ్ : పవన్ కళ్యాణ్ తో మూవీ సెట్ చేసిన దూకుడు డైరెక్టర్ ....??

GVK Writings
సూపర్ స్టార్ మహేష్ హీరోగా సమంత హీరోయిన్ గా తెరకెక్కిన బ్లాక్బస్టర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ మూవీ దూకుడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట నిర్మాతలుగా రూపొందిన ఈ భారీ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. కొన్నేళ్ళ క్రితం మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా గొప్ప విజయం అందుకుని కెరీర్ పరంగా మహేష్ బాబుకి మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది.

తొలిసారిగా మహేష్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీ, యాక్షన్, ఎమోషన్స్, ఫైట్స్ వంటి అంశాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ తరువాత మరొకసారి మహేష్, శ్రీనువైట్ల చేసిన సినిమా ఆగడు. అయితే ఈ మూవీ మాత్రం ఆశించిన స్థాయిలో అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైంది. అనంతరం పలు ఇతర హీరోలతో సినిమాలు చేసిన శ్రీను వైట్ల త్వరలో మంచు విష్ణు తో ఢీ మూవీకి సీక్వెల్ గా ఢీ 2 తీయనున్న విషయం తెలిసిందే. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే ప్రస్తుతం వకీల్ సాబ్ తోపాటు హరిహర వీరమల్లు, అయ్యప్పనుం కోషియం రీమేక్లో కూడా నటిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వాటి అనంతరం దూకుడు డైరెక్టర్ శ్రీను వైట్ల తో ఒక భారీ కమర్షియల్ ఎంటర్ టైనర్ లో నటించనున్నారు అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్.

ఇప్పటికే విష్ణు ఢీ 2 మూవీకి సంబంధించిన స్క్రిప్టు మొత్తం పూర్తి చేసిన శ్రీను వైట్ల ఓ వైపు పవర్ స్టార్ కోసం కూడా ఒక అద్భుతమైన స్టోరీ లైన్ అనుకున్నారని, దానిని ఇటీవల ఆయనకు వినిపించడంతో ఎంతో నచ్చిన పవర్ స్టార్ దాని యొక్క బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేయండి వీలైనంత త్వరగా పట్టాలెక్కిద్దాం అంటూ మాట ఇచ్చినట్లు చెబుతున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త నిజమే అయితే తొలిసారిగా పవన్, శ్రీనువైట్ల కలయికలో ఒక మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ ని ఆశించవచ్చు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: