నవీన్ పోలిశెట్టి కోసం హిట్ డైరెక్టర్.. మహేష్ చొరవతో..!!
వైజయంతి బ్యానర్ నుంచి చాల రోజుల తర్వాత వచ్చిన మంచి సినిమాగా ఈ చిత్రం రికార్డులకెక్కింది.. రిలీజ్ అయినరోజునుంచి ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది.. బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది.ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ తో తో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి కి ఈ సినిమా హిట్ మంచి బూస్ట్ లాంటిది అని చెప్పొచ్చు.మొదటినుంచి ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.. ప్రభాస్ ట్రైలర్ రిలీజ్ చేయడం, విజయ్ దేవరకొండ ప్రీ రిలీజ్ కి రావడం ఇవన్నీ ఈ సినిమా కి మంచి ప్లస్ పాయింట్స్ అయ్యాయి..
ఉప్పెన, నాంది, క్రాక్ సినిమాల తర్వాత ఆ రేంజ్ లో టాక్ తెచ్చుకున్న సినిమా ఇదే అంటే నమ్మాల్సిందే.. విడుదలై ఇన్ని రోజులవుతున్న ఈ సినిమా ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తుందంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం తన తదుపరి సినిమా సన్నాహాల్లో ఉన్నాడు.. మహేష్ బాబు నిర్మాతగా అయన మూడో సినిమా తెరకెక్కుతుంది అంటున్నారు. ఇక ఈ సినిమా కి బ్లాక్ బస్టర్ దర్శకుడు వెంకీ కుడుములు దర్శకత్వం వహిస్తున్నారని అంటున్నారు.. చలో, భీష్మ సినిమా లతో సూపర్ హిట్ కొట్టిన వెంకీ మూడో సినిమా తో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు.