రాజశేఖర్ కు క్షమార్పణలు చెప్పిన శివాని !

Seetha Sailaja

గతసంవత్సరం రాజశేఖర్ కు కరోనా సోకడంతో ఆ సమస్య నుండి బయటపడటానికి చాల కష్టపడిన విషయం తెలిసిందే. అప్పట్లో ఒకానొక సందర్భంలో రాజశేఖర్ ఆరోగ్యం చాల విషమంగా ఉంది అంటూ వార్తలు వచ్చినప్పుడు ఇండస్ట్రీ వర్గాలు ఆయన కోలుకోవాలి అంటూ అనేక సందేశాలు కూడ పెట్టారు.


ఆతరువాత రాజశేఖర్ తన అనారోగ్య సమస్యల నుండి తెరుకోవడమే కాకుండా ఆతరువాత నెమ్మదిగా తాను నటించవలసిన సినిమా పై కూడ దృష్టి పెట్టాడు. ఈ నేపధ్యంలో ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజశేఖర్ పెద్ద కూతురు శివాని తన తండ్రికి కరోనా రావడానికి తానే కారణం అంటూ భావోద్వేగానికి లోనైంది.


అప్పటి కరోనా పరిస్థితులలో తన తల్లి తండ్రి ఇంటికే పరిమితం అయి ఉన్నప్పటికీ తాను మాత్రం తరుచూ బయటకు వెళుతూ ఉండేదానిని అనీ ఒక విధంగా తాను ఇలా బయటకు తిరగడం వల్లనే తన తండ్రికి కరోనా వచ్చి ఉండవచ్చని తన అభిప్రాయం అంటూ కామెంట్స్ చేసింది. అంతేకాదు తన తండ్రి ఎన్నిసార్లు చెప్పినా తాను తన తండ్రి మాట వినేదనిని కాదు అని చెపుతూ ఒక విధంగా అప్పటి పరిస్థితులలో రాజశేఖర్ కు కరోనా రావడానికి తానే కారణం అంటూ అంటూ ఇప్పుడు శివాని బాధపడుతోంది.


అప్పట్లో తన తండ్రి హాస్పటల్ లో ఉన్నప్పుడు ఆయన స్థితి చూసి తనకు విపరీతమైన టెన్షన్ ఏర్పడటంతో తనకు చిన్నప్పుడు ఉన్న గుండె సమస్య మళ్ళీ తిరగపెట్టడంతో ఒకవైపు రాజశేఖర్ ను మరొకవైపు తనను చూసుకోలేక తన తల్లి జీవిత పడ్డ టెన్షన్ తనకు ఇప్పటికీ ఒక చేదు జ్ఞాపకం అంటూ శివాని అలనాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంది. తాను చేసిన తప్పుకు ఈరోజు పశ్చాతాపం పడుతున్నాను అంటూ తన తండ్రికి క్షమార్పణలు తెలియచేసింది. ప్రస్తుతం డాక్టర్ కోర్స్ చదివుతున్న శివాని తనకు సినిమాలలో రాణించాలి అన్న కోరిక ఇంకా తీరలేదు అని అంటోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: