తొమ్మిదేళ్ల తర్వాత.. మళ్లీ అలా చేయబోతున్న పూజా హెగ్డే..?
ఇక కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు అటు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఎప్పుడూ అభిమానులను అలరిస్తోంది ఉంటుంది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో మొదట ఒక లైలా కోసం సినిమా తో హీరోయిన్ గా పరిచయమైన పూజ అంతకుముందే కోలీవుడ్లో మూగముడి అనే సినిమా హీరోయిన్ గా సినీ పరిశ్రమకు పరిచయం అయింది. ఇక ఈ సినిమా తర్వాత పూజ హెగ్డే కి అంతగా అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్లో అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇక టాలీవుడ్ లో అంతకంతకూ క్రేజ్ సంపాదించుకుని ప్రస్తుతం హీరోయిన్ గా కొనసాగుతోంది.
అయితే ఆ తర్వాత మళ్ళీ కోలీవుడ్ పై మాత్రం అంతగా ఆసక్తి చూపలేదు ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ 65వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమాలో పూజా హెగ్డే అవకాశం దక్కించుకుంది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ కోలీవుడ్లో కనిపించేందుకు సిద్ధమైంది పూజా హెగ్డే. ఇక మరికొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగులో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది ఈ సొగసరి. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ పూజాహెగ్డే తమిళ ఇండస్ట్రీ లోకి రావడంతో ఇక ఈ సినిమా పై అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి.