ఆ యువ నటుడికి కరోనా... టెన్షన్ లో టబు!
ఈ చిత్రంలో చాలా ముఖ్యమైన ప్రధాన పాత్రలో టబు కనిపించబోతుంది. అయితే అనూహ్యంగా.. ఈ చిత్రం హీరో అయిన కార్తీక్ ఆర్యన్ నిన్న కరోనాకి గురి అయ్యాడట.రిజల్ట్ పాజిటివ్ రావడంతో..వెంటనే షూటింగ్ కు ప్యాకప్ చెప్పేసి హోమ్ క్వారెంటైన్ కు వెళ్ళిపోయాడట. నిన్నటి షూటింగ్లో కార్తీక్ తో పాటు హీరోయిన్ కియారా అలాగే టబులు కూడా పాల్గొన్నారట.కార్తీక్ కు కరోనా అని తెలిసిన వెంటనే వీరు షాక్ తిన్నట్టు తెలుస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా.. వీరిద్దరూ ఐసోలేషన్ వార్డులో చేరారట.కియారా వయసు.. 28 సంవత్సరాలే కాబట్టి పర్వాలేదు. కానీ టబు వయసు 50 సంవత్సరాలు. అందుకే, ఆమె టెన్షన్ పడుతోందట.
ఈ నేపథ్యంలో ఆమెకు రెండు రోజుల తర్వాత ఆర్టి-పీసీఆర్ టెస్ట్ చేస్తారట. వీలైతే వ్యాక్సిన్ కూడా వేయించుకోవాలని ఆమె నిర్ణయం తీసుకుందని సమాచారం అందుతుంది. ఏజ్ ఎక్కువ కారణంగా తనకు ఏమవుతుందోనని టబు చాలా భయపడుతుందట.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోడానికి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...