నన్ను బట్టలు విప్పేసి కేవలం అండర్వేర్ మాత్రమే ఉంచుకొని డ్యాన్స్ చెయ్యమన్నాడు: ప్రియాంక చోప్రా..

Purushottham Vinay
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాజీ మిస్ వరల్డ్ ప్రియాంకా చోప్రా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.తన హాట్ హాట్ అందాలతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షలాది అభిమానులని సొంతం చేసుకున్న ఈ హాట్ బ్యూటీ తరువాత బాలీవుడ్ ని వదిలి హాలీవుడ్ వెళ్లి అక్కడ "క్వాంటికో " వెబ్ సిరీస్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇక ప్రముఖ అమెరికన్ సింగర్ డిస్నీ స్టార్ నిక్ జోనాస్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తాజాగా ఈమె ఓ డైరెక్టర్ పై చేసిన కామెంట్స్ పెద్ద చర్చకు దారితీసాయి. ఈమె కెరీర్ ప్రారంభంలో 'అండర్ వేర్ మాత్రమే ఉంచుకొని మిగతా బట్టలన్నీ విప్పేసి డాన్స్ చెయ్యమని' ఓ దర్శకుడు చెప్పాడట. ఇటీవల ప్రియాంకా చోప్రా.. 'అన్ ఫినిషిడ్' పేరుతో తన ఆత్మకథని రాసిన సంగతి తెలిసిందే.తాను ఇండస్ట్రీకి  వచ్చిన కొత్తలో ఆమె ఎదుర్కొన్న పరిస్థుతులను సమస్యలను కూడా ఇందులో వివరించే ప్రయత్నం చేసిందట.

ఇక దాని ప్రచారంలో భాగంగా ఓప్రా విన్ ఫ్రె షో లో పాల్గొంది ఈ హాట్ బ్యూటీ. అందులో ఎవ్వరూ ఊహించని కొన్ని విషయాలను బయటపెట్టింది.ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ..' ఓ డైరెక్టర్ నన్ను బట్టలు విప్పేసి కేవలం అండర్వేర్ మాత్రమే ఉంచుకొని డ్యాన్స్ చెయ్యమన్నాడు.వెంటనే నాకు ఆ ఆఫర్ వద్దు అని చెప్పేసి వచ్చేసాను. నేను ఇండస్ట్రీకి కొత్త కాబట్టి.. ఆ దర్శకుడు గురించి బయటకి చెప్పేంత ధైర్యం ఆ టైములో లేదు.

ఇలాంటివి బయటకి చెప్తే.మళ్ళీ నాకు అవకాశాలు రావేమో, ఆమెతో వర్క్ చెయ్యడం కష్టం అని ఆ దర్శకుడు ప్రచారం చేసి నా పై కక్ష సాధిస్తాడేమో అని భయం వేసి మీడియాకి చెప్పలేదు. సెట్ లో అంతమంది జనం మధ్యలో…అండర్ వేర్ వరకు మాత్రమే బట్టలు ఉంచుకో. అంటే చాలా అవమానంగా ఫీలయ్యాను' అంటూ చెప్పుకొచ్చింది. కాని ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు సాధించిన కూడా ఇప్పటికి ఆ డైరెక్టర్ పేరు ఆమె ప్రస్తావించకపోవడం విశేషమనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: