"కరోనా సెకండ్ వేవ్ సృష్టి వారి పనే" సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు...!
కరోనా సెకండ్ వేవ్ అని కథనాలు చెప్పి ప్రజలను భయపెట్టి కార్పొరేట్ సంస్థలు వ్యాపారాలు చేస్తున్నాయని. కరోనా వీక్నెస్ ను అడ్డుపెట్టుకుని మాస్కులు శానిటైజర్ ల డిమాండ్ పెంచేస్తూ లాభాలను ఆర్జిస్తున్నాయి అని గర్జించారు ఆర్ నారాయణమూర్తి. ఇలాంటి వారిని గుర్తించి బుద్ధి చెప్పాల్సిన ప్రభుత్వం కూడా వారు చేస్తున్న అన్యాయాలకు అండగా నిలబడేలా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. మరో వైపు కరోనా కారణంగా సామాన్య ప్రజలు ఇప్పటికే ఆర్థికంగా కుంగిపోయి ఉన్నారని... ఎంతోమంది రోడ్డున పడ్డారని.. కానీ ఇదే కరోనా సమయంలో అంబానీ మరియు అదానీలు వంటి బడా బాబులు మాత్రం వేల కోట్ల ఆస్తులను వెనకేసుకున్నారని ఆరోపించారు.
ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు నారాయణ మూర్తి. మన వారి కడుపు కొట్టి.. కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టే ఈ వ్యవహారం దారుణమైనదని గళమెత్తారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న కార్యక్రమాలు చూస్తుంటే......పంచ భూతాలను సైతం అమ్మేసే విధంగా పరుగులు తీస్తున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు విశాఖ ఉక్కు మన హక్కు.. అందుకు అండగా నేను ఉంటా... అంటూ ప్రజలకు మద్దతు పలికారు ఆర్ నారాయణ మూర్తి. విశాఖ ఉక్కు కర్మాగార కార్మికుల ఉద్యమంతో పాటు రైతు ఉద్యమంకు కూడా తాను మద్దతుగా ఉంటున్నా అంటూ పేర్కొన్నారు ఆర్ నారాయణమూర్తి. మరోవైపు విశాఖ ఉక్కు ఉద్యమం, రైతుల ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి.