శశి సినిమా మొదటి రోజు ఎంత రాబట్టిందంటే....?

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ వారసునిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కేవలం మొదటి రెండు సినిమాలతోనే హిట్లు అందుకున్నాడు. ఆ తరువాత వరుసగా ప్లాప్స్ అందుకోని సరైన క్రేజ్ సంపాదించుకోలేకపోయాడు.ఇక చాలా గ్యాప్ తీసుకొని ఎన్నో ప్లాపుల తరువాత హీరోగా "శశి" సినిమాతో ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో సురభి హీరోయిన్ గా నటించింది.శ్రీనివాస్ నాయుడు నడికట్ల ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. 'శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్' పతాకంపై ఆర్‌.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 19న(నిన్న) విడుదలైన ఈ చిత్రం ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. అరుణ్ చిలువేరు సంగీతంలో రూపొందిన 'ఒకే ఒక లోకం' అనే పాట ఈ మధ్య కాలంలో మంచి హిట్ అయ్యి సినిమా పై అంచనాలు ఏర్పడేలా చేసింది.కాని ఆ అంచనాలను ఈ సినిమా ఏమాత్రం అందుకోలేకపోయిందనే చెప్పాలి. ఆది కెరీర్ లో మళ్ళీ మరో భారీ ప్లాప్ పడింది.

ఇక ఈ సినిమా మొదటి రోజు ఎంత వరకు వసూళ్లు రాబట్టిందంటే...ఆది నటించిన ఈ 'శశి' చిత్రానికి 3.2కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 3.5కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.మొదటిరోజు ఈ చిత్రం కేవలం 0.20కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 3.30 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పోటీగా 'చావు కబురు చల్లగా' 'మోసగాళ్ళు' వంటి సినిమాలు విడుదలవ్వడం అలాగే బ్లాక్ బస్టర్ 'జాతి రత్నాలు' చిత్రం ఇంకా స్ట్రాంగ్ గా రన్ అవుతుండడంతో ఈ చిత్రానికి పెద్ద దెబ్బ పడినట్టు స్పష్టమవుతుంది.ఇక ప్లాప్ టాక్ రావడంతో ఈ సినిమా అంత మొత్తం రాబట్టడం కష్టమే అని చెప్పాలి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: