సింప్లిసిటీకి మారు పేరు మా హీరో అంటున్న అభిమానులు.. !!

Suma Kallamadi
అజిత్ పేరు వింటే చాలు అభిమానుల్లో ఎక్కడలేని ఆనందం వచ్చేస్తుంది. ఆయన నటనకు ఎంతో మంది అభిమానులు ఫిదా అయిపోతారు కూడా ఎందుకంటే ఆయన నటనలో  సింప్లిసిటీ కనిపిస్తుంది. అజిత్ ను అందరు కూడా తలా అని పిలుచుకుంటారు.అజిత్ కు కేవలం ఒక్క తమిళ అభిమానులు మాత్రమే కాకుండా అటు తెలుగు, బాలీవుడ్ లో సైతం అభిమానులు ఉన్నారు. అజిత్ ను మల్టీ టాలెంటెడ్ హీరో అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. అలాగే అజిత్ రీసెంట్‌గా హిందీలో డబ్బింగ్ చేస్తున్న సినిమాలు సైతం సూపర్ డూపర్  హిట్ కొడుతున్నాయి. ఇప్పుడు అజిత్ కు సంబందించిన ఒక  వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చుసిన అభిమానులు అంతా వాళ్ళ హీరోను చూసి  ఫుల్ జోష్ లో ఆనందపడుతున్నారు.


అలాగే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు కామెంట్స్ కూడా పెడుతున్నారు. "మా హీరో అంతే.. చాలా సింపుల్‌' అంటూ కొంత మంది అభిమానులు కాంప్లిమెంట్లు ఇచ్చేస్తున్నారు. అసలు ఇంతకీ ఆ వీడియోలో ఏముంది. అభిమానులు ఎందుకు ఇలా అజిత్ ను అభినందిస్తున్నారు అనే విషయానికి వస్తే.. అజిత్ చేసిన ఆటో ప్రయాణమే కారణం అని చెప్పవచ్చు.ఎంత పెద్ద పేరు, ప్రతిష్టలు ఉన్నాగాని, ఎన్ని  డబ్బులు, కార్లు ఉన్నాగాని ఇలా ఆటోలో ప్రయాణం చేయడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇటీవల చెన్నైలో ఒక ఆటోలో అజిత్ వెళుతూ కనిపించారు.


అజిత్ ముఖానికి మాస్క్‌ ఉన్నప్పటికీ ఆయన కచ్చితంగా అజిత్ అని అర్థమైపోతుంది.ఆయన్ని చుసిన అభిమానులు  ఆయన్ను గుర్తుపట్టి  వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియో సైతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అంత పెద్దా హీరో అయి ఉండి కూడా ఆటోలో ప్రయాణం చేయడం అనేది ఆయన నిరాడంబరతకు చిరునామా అంటూ అజిత్ ను ఆయన ఫాన్స్ తెగ పొగిడేస్తున్నారు. అంతే కాకుండా ఇటీవల హైదరాబాద్ రోడ్లపై సైకిలింగ్ చేస్తూ కూడా కనిపించి అందరిని ఆశ్చర్య పరిచాడు.అసలు అజిత్ పుట్టి పెరిగింది అంతా కూడా  హైద‌రాబాద్‌లోనే అవ్వడం విశేషం. ఇకపోతే అజిత్ ప్రస్తుతం 'వలిమై' అనే చిత్రంలో నటిస్తున్నారు... !!








మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: