సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన యాక్టింగ్ తో హ్యాండ్సమ్ లుక్స్ తో కొన్ని ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లాదిమంది అభిమానులని సంపాదించుకున్నాడు. మహేష్ కనిపిస్తే చాలు అభిమానుల ఉర్రుతలూగిపోతారు. ఇక సోషల్ మీడియాలో కూడా మహేష్ కి మామూలు ఫాలోయింగ్ లేదు. మహేష్ గురించి ఏ చిన్న అప్ డేట్ వచ్చిన డాన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తుంటారు మహేష్ అభిమానులు.ఇక మహేష్ యాడ్స్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అవుతాయి.ఇక అసలు విషయానికి వస్తే..మహేష్‌బాబు, తమన్నా కలసి ఓ హోం అప్లియెన్సెస్ సంస్థకు యాడ్ చేశారు. తొలి రోజు ఏదో యాడ్‌లో నటిస్తున్నారని వార్తలొచ్చాయి. ఆ తర్వాత అది ఇదే అంటూ సంస్థ పేరు వచ్చింది.ఈ యాడ్ షూట్ ని మహేష్ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. ఈ యాడ్ కి సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ చేస్తున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియా అంత ఈ యాడ్ గురించే చర్చ జరుగుతుంది. ఒక పెద్ద సినిమా రేంజిలో ఈ యాడ్ ట్రెండ్ అవుతుందంటే సూపర్ స్టార్ స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం "సర్కారు వారి పాట" సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని "గీతా గోవిందం" ఫేమ్ పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి మహేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో అలాగే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ మూవీస్ చెయ్యడానికి కమిట్ అయ్యాడు. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సినిమా విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి....