మహేష్ ఫ్యాన్స్ కి పెద్ద షాక్ ఇచ్చిన మాస్టర్ హీరోయిన్ .... మ్యాటర్ ఏమిటంటే ....?
తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ మాస్టర్ లో హీరోయిన్ గా నటించిన మాళవిక ఆ మూవీ సక్సెస్ తో మంచి పేరు దక్కించుకుంది. అసలు మ్యాటర్ ఏమిటంటే కొద్దిసేపటి క్రితం, మీలో ఎవరు ఈ కాంబో కోసం వెయిట్ చేస్తున్నారు అంటూ ఒక అభిమాని, మహేష్ తో మాళవిక కలిసిన ఒక ఫోటో ని సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా, అది చూసిన మాళవిక నేను అంటూ అతడికి రిప్లై ఇవ్వడంతో ఒక్కసారిగా ఆ పోస్ట్ సోషల్ మీడియా లో ఎంతో వైరల్ అవుతోంది. మొత్తానికి ఈ విధంగా సూపర్ స్టార్ మహేష్ అందానికి మరొక హీరోయిన్ ఫిదా అంటూ పలువురు మహేష్ ఫ్యాన్స్, త్వరలోనే ఈ కాంబో సెట్ కావాలని కోరుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఒకరకంగా తన రిప్లై తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన మాళవిక కోరిక ఎప్పటికి తీరుతుందో చూడాలి...!!