నిజంగా మహేష్ గోపి చంద్ మలినేనికి అవకాశం ఇస్తాడా?
ఈ ఏడాదిలోనే సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే గోపీచంద్ కి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మరో ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలయ్య సినిమాతో గనుక సూపర్ హిట్ అందుకుంటే తన తదుపరి సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబుని రంగంలోకి దించుతామని గోపీచంద్ మలినేనికి బంపర్ ఆఫర్ ఇచ్చిందట మైత్రి సంస్థ.మహేష్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే గనుక గోపీచంద్ మలినేని స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లోకి చేరిపోవడం ఖాయం. ఇలాంటి బంపర్ ఆఫర్ ని ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్నాడు మలినేని. దీనికోసం బాలయ్య సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. కచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు ఈ మాస్ డైరెక్టర్. మహేష్ బాబుకి మైత్రి సంస్థతో మంచి బంధం ఉంది.
గతంలో వీరితో కలిసి 'శ్రీమంతుడు' అనే సినిమాకి పని చేశాడు. ప్రస్తుతం మహేష్ నటిస్తోన్న 'సర్కారు వారి పాట' సినిమాను నిర్మిస్తుంది కూడా మైత్రి సంస్థే. ఈ నమ్మకంతోనే గోపీచంద్ మలినేనికి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇక ఈ ఆఫర్ దక్కగానే గోపి చంద్ ఫుల్ ఖుషిగా వున్నాడట. ఎలాగైనా బాలయ్యతో బంపర్ హిట్ కొట్టి మహేష్ ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకోవాలని చూస్తున్నాడట. చూడాలి మరి వరుస కమిట్మెంట్లతో బిజీగా వున్న మహేష్ గోపి చంద్ కథకి ఇంప్రెస్ అయ్యి సినిమా చేస్తాడో లేదో... ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...