స్టార్ ఇమేజ్ ఉంది కదా అని ఏది పడితే అది చేస్తే ఎక్కడో ఒకచోట ఇరుక్కోక తప్పదు. యాడ్ చేసిన స్టార్ హీరోలందరిది ఇదే గొడవ. మొన్నామధ్య మ్యాగీ యాడ్లో నటించినందుకు అమితాబ్, ప్రీతి లకు కోర్ట్ సమన్లు పంపించిన విషయం తెలిసిందే. తాజాగా మళయాల సూపర్ స్టార్ మమ్ముట్టిని కూడా ఓ యాడ్ కోర్ట్ మెట్లు ఎక్కేలా చేస్తుంది. అసలు విషయంలోకి వెళితే మళయాలంలో స్టార్ ఇమేజ్ ఉన్న మమ్ముట్టి యాడ్లలో కూడా ఓ రేంజ్లో దూసుకెళ్తున్నాడు. అయితే ఓ యాడ్ సంబందించి మమ్ముట్టికి కోర్ట్ వివరణ కోరిందని సమాచారం. మమ్ముట్టి మళయాలంలో 'ఇందులేఖ' అనే సబ్బు యాడ్ చేస్తున్నాడట.
'ఇందులేఖ సబ్బును వాడండి.. అందం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది' అన్న కాన్సెప్ట్ తో యాడ్ చేశాడట మమ్ముట్టి. మమ్ముట్టి చెప్పాడు కదా అని కొనుక్కుని వాడాడట ఓ కుర్రాడు. కాని అతను చెప్పినట్టు అందంగా తయారవ్వలేదని ఆ కంపెనీపై గొడవకు దిగాడట.. అంతేకాదు ఆ కంపెనీ మీద, కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మమ్ముట్టి మీద కూడా కేసు కూడా పెట్టాడట సదరు వ్యక్తి. స్పందించిన కోర్ట్ ఈ విషయం మీద మమ్ముట్టిని ఈ నెల 22వ తేదీ లోపల వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిందట.
ఇందులేఖ సోప్ యాడ్ లో మమ్ముట్టి :
ఏదో సైడ్ బిజినెస్ గా హీరోలు యాడ్లు చేసుకుంటుంటే వారి పట్ల అవి శాపంలా మారడం విచిత్రంగా ఉంది. అయితే యాడ్ ల వల్ల తలనొప్పి ఫీల్ అయిన ప్రముఖులు చాలా మందే ఉన్నారు. వీరంతా కలిసి యాడ్ అనేది ప్రొడక్ట్ ప్రమోషన్ కోసమే కాని దాన్ని మేము వాడి ఆ సర్టిఫికెట్ ఇవ్వట్లేదని యాడ్ ముందే ఓ సర్టిఫికెట్ ఇస్తే.. ఇలా ప్రతి సారి యాడ్ చేసి కోర్ట్ దాకా వెళ్లాల్సిన పని ఉండదు. ప్రస్తుతం టాలీవుడ్లో కూడా యాడ్స్ లో హీరోలు పోటీ పడి మరీ చేసేస్తున్నారు. ఒక్కసారి ఇలాంటి షాక్ మన వాళ్లకు తగిలితే యాడ్స్ వచ్చినా నో అని చెప్పే అవకాశం ఉంది.
ప్రతి సారి యాడ్ చేయడం దాని మీద ఎవరో ఒకరు కేసు వేయడం దానికి వీరు సంజాయిషి ఇవ్వడం సెలబ్రిటీస్ కి కూడా ఇది కామన్ అయ్యింది . అలా కాకుండా యాడ్ చేస్తున్నప్పుడే పర్ఫెక్ట్ అగ్రిమెంట్ ఒకటి చేసుకుంటే ఇలాంటి అపవాదాలను ఫేస్ చేసే ప్రాబ్లెం ఉండదు. మరి యాడ్ చేస్తున్న స్టార్ హీరోలే దీనికి పూనుకుని ముందడుగేసి ఇలాంటి అగ్రిమెంట్ ని ఒకటి ఇంప్లిమెంట్ చేయాలి.