ట్రెండ్ మార్చిన తెలుగు సినిమా

shami
టాలీవుడ్ సినిమాలు ఎక్కువగా హీరో ఇమేజ్ మీద ఆడుతాయనేది అందరికి తెలిసిన సత్యం, ఇన్నాళ్ళు కథ లేకుండా హీరోనే నడిపించేవాడు కాని ఇప్పుడు సీను మారి కథనే హీరో నడిపించే పయత్నం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇది నిజంగా తెలుగు సినిమాలో వచ్చిన ఒక పెద్ద మార్పే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదో సినిమా తీశాంలే అనే ఆలోచన నుండి విషయం ఉన్న సినిమా తీశామా లేదా అన్నట్టుగా ఇప్పుడు హీరోల థోరణి మారుతుంది. రీసెంట్ గా వచ్చిన బాహుబలి, శ్రీమంతుడు కేవలం హీరో ఉన్నాడు కాబట్టే ఆడిన సినిమాలు కావవి. కథ, కథనాల్లో దమ్ముండబట్టే ఆ రేంజ్ విజయాలను సొంతం చేసుకున్నాయి.


 
అయితే కొత్త వారిలో ఇలా కంటెంట్ సినిమాల మీద వెళ్ళే హీరోలు తక్కువే అని చెప్పొచ్చు కాని మెగా వారసుడిగా నాగబాబు తనయుడు దానికి శ్రీకారం చుట్టాడు. 'కంచె' సినిమా టీజర్ తో సిని ప్రముఖులందరి చేత వారేవా అనిపించుకుంటున్నాడు వరుణ్ తేజ్. 'కంచె' సినిమా డైరెక్టర్ క్రిష్ గొప్ప తనమే అయినా ఇలాంటి సినిమాను ఒప్పుకోవడం వలన వరుణ్ తేజ్ కి బెస్ట్ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం నాటి సన్నివేశాలను అద్భుతంగా చూపించిన దర్శకుడు క్రిష్ ఈ సినిమాతో టాప్ రేంజ్ కి వెళ్ళడం ఖాయం అంటున్నారు. ఇక ఫైనల్ గా హీరోలందరు కథకి ఇంపార్టెన్స్ ఇవ్వడం మంచి తరుణం గా భావిస్తున్నారు ప్రేక్షకులు.


కంచె సినిమాలో వరుణ్ తేజ్ : 



ఏదో నాలుగు ఫైట్లు.. రెండు లవ్ సీన్లు.. రివేంజ్ స్టోర్లని కాకుండా.. ఇలా కొత్త కొత్త ప్రయోగాలు, ప్రయత్నాలు చేస్తే టాలీవుడ్ చరిష్మాను ప్రపంచ వ్యాప్తంగా తెలియచేసే అవకాశం ఉంది. సో ఆడియెన్స్ మన సినిమాల్లో వచ్చిన ఈ మార్పుని మనం కూడా ఎంకరేజ్ చేసి సినిమాల స్థాయిని పెంచేందుకు మనం కూడా కృషి చేద్దాం. రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ చేస్తూనే అప్పుడప్పుడూ ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేస్తే ఆడియెన్స్ కి కూడా చాలా పాజిటివ్ గా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది. సో ట్రెండ్ మార్చిన తెలుగు సినిమాను ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని అనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: